జగన్‌వర్గంపై వేటు: వెనక్కి తగ్గిన బాబు, కిరణ్ సేఫ్

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టవద్దని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 10వ తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మొదటి నాలుగు రోజులు మాత్రమే సమావేశాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి. ఆ తర్వాత తన కోడలు బ్రాహ్మణి గ్రాడ్యూయేషన్ కార్యక్రమం నేపథ్యంలో ఆయన అమెరికా వెళ్లనున్నారు.

చంద్రబాబు ఉండకపోవడం, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి స్పష్టమైన మెజార్టీ ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టకూడదని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. వచ్చే సమావేశాలలో దీనిపై ఆలోచించనున్నారని తెలుస్తోంది. అయితే అవినీతి మంత్రులను తొలగించాలని నిరసిస్తూ టిడిపి ఎమ్మెల్యేలు సమావేశాలని బహిష్కరించాలని భావిస్తున్నారు.

TDP backs out on No Trust Vote, To boycott Ministers

కాగా 15 మంది ఎమ్మెల్యేలపై వేటు పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని అర్థమవుతోంది. తొమ్మిది మంది కాంగ్రెసు, ఆరుగురు టిడిపి ఎమ్మెల్యేలపై వేటు పడటంతో కాంగ్రెసు ప్రభుత్వం మెజార్టీని సాధించింది. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఎలాంటి అవిశ్వాస తీర్మానం పెట్టకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా అధికార పార్టీ వారిపై వేటు వేసిందని చెబుతున్నారు.

సాంకేతికంగా కిరణ్ ప్రభుత్వం ఆధిక్యాన్ని సాధించింది. ప్రస్తుత లెక్కల ప్రకారం మేజిక్ ఫిగర్ 139. దీనికంటే అధికార పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు అధికంగా ఉన్నారు. మున్ముందు ఎవరు అవిశ్వాస తీర్మానాలను ప్రవేశ పెట్టినా ప్రశాంతంగా ఎదుర్కొనే సత్తా సర్కార్‌కు వచ్చేసింది. రాష్ట్ర శాసనసభలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 294. కాగా, 15 మంది అనర్హత వేటుకు గురయ్యారు. అవనిగడ్డ ఎమ్మెల్యే బ్రాహ్మణయ్య మరణించారు. దీంతో, ప్రస్తుతం సభలో 278 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

న్యాయస్థానం ఆదేశాల మేరకు వీరిలో కాంగ్రెస్ సభ్యడు జనార్దన్ తాట్రాజ్, టిడిపి ఎమ్మెల్యే సుమన్ రాథోడ్‌లకు ఓటు హక్కు లేదు. నామినేటెడ్ సభ్యురాలు క్రిస్టియానా లాజరస్‌కు మాత్రం ఓటు హక్కు ఉంటుంది. అంటే, సభలో 277 మందికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. దీని ప్రకారం మేజిక్ ఫిగర్ 139 అవుతుంది. ఇక, ఇప్పటి వరకు అధికార కాంగ్రెస్‌కు 155 మంది ఎమ్మెల్యేలుండగా.. తాజా వేటుతో ఆ సంఖ్య 146కు పడిపోయింది. అయినా, మేజిక్ ఫిగర్ కంటే ఏడు స్థానాలు ఎక్కువే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+