చంద్రబాబుపై గొంతు పెంచిన జగన్ పార్టీ

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీ కోసం' పాదయాత్ర ద్వారా అధికార పార్టీతో మిలాఖత్ రాజకీయాలు నెరపడం తప్పితే మరేమీ సాధించలేదని వైయస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం దుయ్యబట్టింది. ఈ మేరకు వైయస్సార్ శాసనసభాపక్ష ఉపనేతలు మేకతోటి సుచరిత, భూమా శోభానాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబును ప్రపంచ రికార్డుల్లో నమోదు చేసేందుకు తగిన అర్హతలున్నాయని వారు వ్యాఖ్యానించారు.
‘‘అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయొద్దని విప్ జారీ చేసిన ప్రతిపక్ష పార్టీగా టీడీపీ చరిత్రపుటల్లోకి ఎక్కింది. దీనికి శాయశక్తులా కృషిచేసిన చంద్రబాబును ప్రపంచ రికార్డుల్లో నమోదు చేయాలి. అంతేకాదు బాబు పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ముగింపు వరకు దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వదిలివెళ్లడం ఒక రికార్డే. ప్రజాస్వామ్యంలో ఏపార్టీలోనూ ఈ విధంగా జరగలేదు. ఎమ్మెల్యేలే కాకుండా వేలాదిమంది కార్యకర్తలు పార్టీకి స్వస్తిచెప్పి ఇతర పార్టీల్లో చేరారు'' అని తెలిపారు.
గతంలో తగిన సంఖ్యాబలం లేకపోయినా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టిన చంద్రబాబు పాదయాత్రతో పరిణితి చెంది అవిశ్వాసం సందర్భంగా ప్రభుత్వాన్ని కాపాడేందుకు విప్ జారీ చేసే స్థాయికి ఎదిగారని అన్నారు. సుప్రీంకోర్టు సిబిఐ చేసిన వ్యాఖ్యల విషయంలో చంద్రబాబు నోరు మెదపకపోవడాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు దుమ్మెత్తిపోశారు.
దేశంలో చీమచిటుక్కుమన్నా నానా యాగీ చేసే టీడీపీ అధినేత చంద్రబాబు సీబీఐ ధోరణిపై దేశవ్యాప్తంగా అన్ని రాజకీయపార్టీలు పెదవి విరుస్తున్నప్పటికీ పెదవి విప్పకపోవడంలో మతలబేమిటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మారిన సీబీఐలో చంద్రబాబు కూడా భాగస్వామ్యం అయినట్లున్నారని విమర్శించారు. జగన్ కేసు విషయంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఏది చెబితే సిబిఐకి అది వేదంలా కనబడుతోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెసుతో మిలాఖతయ్యారని విమర్శిస్తూ రాజకీయంగా చంద్రబాబును దెబ్బ తీయడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రయత్నిస్తోంది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications