ఓటుపై భరణి, యాక్టర్ కాంగ్రెసులోకి జీవా (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ రాజకీయాల్లో ముఖ్యమైన భూమికను పోషిస్తూ వస్తోంది. రాజకీయ నాయకులు వివిధ పార్టీల్లో చేరి, తమ వంతుగా ఆ పార్టీలను గెలిపించడానికి కృషి చేస్తున్నారు. మరికొంత మంది పోటీకి దిగారు. మురళీమోహన్, రోజా వంటివారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీనే స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమైన నేతగా మారిపోయారు. బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు విషయంలో ఆయన కీలక భూమిక పోషించారు. బిజెపి నేత నరేంద్ర మోడీని ప్రధానిని చేయాలని ఆయన అన్నారు.
తాజాగా, నటుడు జీవా కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని అనుకున్నారు. చంద్రబాబు నాయుడిని కలిశారు. కానీ, అది ఫలించినట్లు లేదు. ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి ఓటు హక్కుపై చైతన్యాన్ని పెంచేందుకు సిద్ధపడ్డారు.

కాంగ్రెసులోకి నటుడు జీవా...
సినీ నటుడు జీవా కాంగ్రెసు పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆయన ప్రయత్నించారు. కానీ ఫలించినట్లు లేదు.

కాంగ్రెసు కండువా కప్పుకున్న జీవా
సినీ నటుడు జీవా కాంగ్రెసు కండువా కప్పుకుని ఇలా కనిపించారు. సీమాంధ్రలో కాంగ్రెసు అభ్యర్థులు కరువైన స్థితిలో ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారా చూడాల్సిందే.

నామినేషన్ వేస్తారా..
సీమాంధ్రలో నామినేషన్ల దాఖలుకు శనివారం చివరి తేదీ. యాక్టర్ జీవా ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారా చూడాలి.

ఒక్క ఓటు ఆడియో సిడి
ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి ఒక్క ఓటు ఆడియో సిడిని విడుదల చేశారు. ఓటు హక్కును వినియోగించుకోకపోతే పాపమని ఆయన అన్నారు.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications