ఓ చిన్న ఐడియా: కెసిఆర్‌కు పోటీ ఇవ్వాలంటే...
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌కు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు మధ్య పూడ్చలేనంతగా ఎడం పెరిగిందనే మాట వినిపిస్తోంది. కోదండరామ్ వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దాంతో ఆయనను అత్యంత ఇష్టంగా చూసే ఈటెల రాజేందర్ వంటి మంత్రులు కూడా ఆయనపై విమర్శలు చేస్తున్నారు.
అయితే, కోదండరామ్ రాజకీయ పార్టీ పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అది ఎంత వరకు నిజమో తెలియదు గానీ ఆయన మాత్రం తన పాత మిత్రులను కలుస్తూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వామపక్ష భావజాలం గల నాయకులను కలుస్తూ వస్తున్నారు.
కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెసు, తెలుగుదేశం, బిజెపిలతో పాటు వామపక్షాలు కూడా కెసిఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. కానీ, అవేవీ కెసిఆర్‌కు ప్రత్యామ్నాయం కాలేకపోతున్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. కెసిఆర్‌కు తెలంగాణలో ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలంటే ఓ మార్గం ఉంది. ఆ మార్గం ఏమిటి, ఎవరు ఎంత వరకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందనేది చూద్దాం...

కెసిఆర్ బలమేమిటో చూద్దాం..
తెలంగాణలో కెసిఆర్‌ను ఎదుర్కోవడం ప్రతిపక్షాలకు ఏ మాత్రం సులభంగా కనిపించడం లేదు. తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా గత ప్రభుత్వాల హయాంల్లో కూడా తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు నిర్వహించిన పాత్రను ప్రజలు మరిచిపోలేకపోతున్నారు. ఆ పార్టీలు తమకు చేసిందేమి లేదని ప్రజలు భావిస్తుండడమే కాకుండా వివిధ పథకాలతో కెసిఆర్ ప్రజలకు నమ్మకం కలిగించే పనులు చేస్తున్నారు. ఒక రకంగా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల పట్ల తీవ్ర విముఖత, వామపక్షాలు ప్రజలకు అనుగుణంగా వ్యవహరించలేకపోవడం కెసిఆర్ బలంగా కనిపిస్తోంది. బిజెపి తెలంగాణలో బలం పుంజుకునే అవకాశాలు తక్కువ.

ప్రతిపక్షాలు ఏం చేయాలి...
ప్రతిపక్షాలన్నీ ఒక తాటి మీదికి వచ్చిన తమ నాయకుడిగా కోదండరామ్‌ను ప్రకటించాలి. తమ ఐక్య సంఘటన గెలిస్తే కోదండరామ్ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించాలి. కోదండరామ్‌కు ప్రజల్లో విశ్వసనీయత ఉండడం అందుకు కారణం. కోదండ రామ్‌పై ఉన్న నమ్మకం కారణంగా ప్రతిపక్షాలు మద్దతు ఇస్తే కెసిఆర్‌కు బలమైన ప్రత్యామ్నాయం రూపొందించవచ్చు.

కాంగ్రెసు నేతలు ముందుకు వస్తారా..
కోదండరామ్‌ను తమ నాయకుడిగా గుర్తించి, ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి కాంగ్రెసు నాయకులెవరూ ముందుకు రాకపోవచ్చు. రాజకీయాల్లో కాకలు తీరిన జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డికె అరుణలతో పాటు ఇంకా పలువురు కాంగ్రెసు నాయకులు తామే ముఖ్యమంత్రి అభ్యర్తి అనే అభిప్రాయంతో ఉంటారు. తాము అధికారంలోకి రాలేకపోయినప్పుడు కెసిఆర్‌కు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం వారికి ఉండకపోవచ్చు.

రేవంత్ రెడ్డి వైఖరి మరోలా..
తెలుగుదేశం పార్టీని తెలంగాణలో దాదాపు చంద్రబాబు నాయుడు వదిలేశారు. రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్న తీరు మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులకు రుచించడం లేదు. దీంతో ఆ పార్టీ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చే అవకాశం లేదు. పైగా, రేవంత్ రెడ్డి తానే తదుపరి ముఖ్యమంత్రిని అవుతాననే ధీమాతో ఉన్నారు. అందువల్ల కోదండరామ్ నాయకత్వాన్ని అంగీకరించడానికి ఆయన ఇష్టపడకపోవచ్చు.

వామపక్షాలు ముందుకు వస్తాయా..
కోదండరామ్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించి, ఆయన నాయకత్వంలో వామపక్షాలు పనిచేసే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ, ఆయనతో కలిసి పనిచేయడానికి అవి ఇష్టపడ వచ్చు. వామపక్షాలు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలతో కూడా కలిసి పనిచేయడానికి ముందుకు రావచ్చు. కానీ, కోదండరామ్ నాయకత్వాన్ని అంగీకరిస్తాయా అనేది అనుమానం.
-
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
ఎవరికీ తెలియని అందమైన అడవి.. హైదరాబాద్ కు 40 కి. మీ. దూరంలోనే..












Click it and Unblock the Notifications