ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఆచంట నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోక‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా పెనుగొండ‌, పొదూరు, పెనుమంట్ర మండ‌లాలు ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలో చేరాయి. అంతకు ముందు ఉన్న పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గం 2009 లో ర‌ద్దు అయింది. గ‌తంలో పెనుగొండ నుండి గెలిచి ఆ నియోజ‌క‌వ‌ర్గ ర‌ద్దుతో ఆచంట నుండి పోటీ చేసారు మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ‌. పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గం నుండి క‌మ్యూనిస్టు ప్ర‌ముఖుడు వంకా స‌త్య‌నారాయ‌ణ మూడు సార్లు గెలుపొందారు. మ‌హిళా నేత ప‌త్తి మ‌ణెమ్మ రెండు సార్లు గెలిచారు. మ‌ణెమ్మ ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా ప‌ని చేసారు. ఆచంట‌లో సిపిఎం అభ్య‌ర్దిగా దిగుబాటి రాజ‌గోపాల్ రెం డు సార్లు, దాస‌రి పెరుమాళ్లు, శ్యామ‌సుంద‌ర రావులు వేర్వేరు చోట్ల రెండేసి సార్లు గెలుపొందారు. 2009 త‌రువాత ఇక్క‌డ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల్లో మార్పులు జ‌రిగాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో..
ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌రకు 12 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ నాలుగుసార్లు, టిడిపి నాలుగు సార్లు, సిపిఐ ఒక‌సారి, సిపియం మూడు సార్లు గెలిచాయి. పెనుగొండ లో కాంగ్రెస్ అయిదు సార్లు గెల‌వ‌గా.. టిడిపి రెండు సార్లు గెలిచింది. మూడు సార్లు సిపిఐ గెలుపొందింది. కెఎంపిపి ఒక‌సారి, స్వ‌తంత్ర అభ్య‌ర్ది ఒక‌సారి గెలిచారు. ఇక‌, 2004 లో పెనుగొండ‌, 2009 లో ఆచంట నుండి గెలిచిన పితాని స‌త్య‌నారాయ‌ణ వైయ‌స్, రోశ‌య్య‌, కిర‌ణ్ క్యాబినెట్‌లో మంత్రిగా ప‌ని చేసారు. 2014 ఎన్నిక‌ల ముందు టిడిపిలో చేరారు.

AndhraPradeshElections2019: All about Achanta Constituency

2014 లో టిడిపి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో ఆచంట లో మొత్తంగా 159616 ఓట్లు ఉండ‌గా, అందులో 129680 ఓట్లు పోల‌య్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన పితాని స‌త్య‌నారాయ‌ణ కు 63549 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన ప్ర‌సాద‌రాజు కు 59629 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి అభ్య‌ర్ది పితాని స‌త్యనారాయ‌ణ 3920 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్క‌డ గెలిచిన పితాని స‌త్య‌నారాయ‌ణ 2017 లో జ‌రిగిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో చంద్రబాబు ప్ర‌భుత్వంలో మంత్రి అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+