ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: అమ‌లాపురం (ఎస్సీ) నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 లో జ‌రిగిన నియోక‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా జ‌న‌ర‌ల్ నుండి ఎస్సీకి రిజ‌ర్వ్ అయింది. కొత్త‌గా డీలిమిటేష‌న్ స‌మ‌యంలో ఉప్ప‌ల‌గుప్తం, అల్ల‌వ‌రం మండ‌లాలు ఇక్క‌డ చేరాయి. 2009 లో ఇక్క‌డ ప్ర‌జారాజ్యం అభ్య‌ర్ది రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ గెలిచిన విశ్వ‌రూప్ గ‌తంలో ముమ్మిడివ‌రంలో గెలుపొందారు. విశ్వ‌రూప్ వైయ‌స్, రోశ‌య్య , కిర‌ణ్ క్యాబినెట్‌లో మంత్రిగా ప‌ని చేసారు. ఇక్క‌డ కూడిపూడి ప్ర‌భాక‌ర‌రావు నాలుగు సార్లు గెలిస్తే, ఆయ‌న తండ్రి సూర్య నారాయ‌ణ ఒక‌సారి గెలిచారు. మ‌రో నేత మెట్ల స‌త్య‌నారాయ‌ణ రావు మూడుసార్లు విజ‌యం సాధించారు. 2004 లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్య‌ర్ది కుడిపూడి చిట్ట‌బ్బాయి స్వ‌తంత్ర అభ్య‌ర్దిగా గెలిచారు. కుడిపూడి ప్ర‌భాక‌ర రావు, విశ్వ‌రూప్‌, మెట్ల స‌త్య‌నారాయ‌ణ లు ఇక్క‌డి నుండి గెలిచి మంత్రులుగా ప‌ని చేసారు.

15 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే..
ఇక్క‌డ మొత్తం 15 సార్లు ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ అయిదు సార్లు, టిడిపి నాలుగు సార్లు, జ‌న‌తా, ప్ర‌జాపార్టీ, ఎస్‌సిఎఫ్ ఒక్కొక్క సారి గెలుపొందారు. గ‌తంలో రెండ సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి విశ్వ రూప్ ఆ త‌రువాత వైసిపి లో చేరారు. 2014 ఎన్నిక‌ల్లో అమ‌లాపురం ఎంపీగా పోటీ చేసారు. పాయ‌క‌రావు పేట నుండి గ‌తం లో ఎమ్మెల్యే గా గెలిచిన బాబూ రావు ఇక్క‌డ నుండి వైసిపి అభ్య‌ర్దిగా పోటీ చేసారు.

AndhraPradeshElections2019: All about Amalapuram (SC) Constituency

2014 ఎన్నిక‌ల్లో టిడిపి గెలుపు
2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుండి గ‌తంలో ఓడిన ఆనంద‌రావు పోటీ చేసారు. ఇక్క‌డ మొత్తంగా 191497 ఓట్లు ఉంటే, అందు లో 149063 ఓట్లు పోల‌య్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన ఆనంద‌రావుకు 76444 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన బాబురావుకు 64031 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి అభ్య‌ర్ది ఆనంద‌రావు 12413 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+