ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: అవనిగడ్డ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాలు కొత్తగా వచ్చి చేరాయి. అవ ని గడ్డలో రెండు సార్లు గెలిచిన చల్లపల్లి జమీందార్ రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ దివి నియోజకవర్గంలో మరోసారి గె లు పొందారు. ఆయన గతంలో కాసు మంత్రివర్గంలో పని చేసారు. మండలి వెంకట కృష్ణారావు ఒకసారి ఏకగ్రీవం తో సహా మొత్తం మూడు సార్లు ఎన్నికయ్యారు. మండలి ఒకసారి ఎంపీగా గెలిచారు. ఆయన కుమారుడు బుద్దప్రసాద్ రెండు సార్లు గెలుపొందారు. సింహాద్రి సత్యానారాయణ మూడు సార్లు గెలిచి టిడిపి లో మంత్రిగా పని చేసారు. 2009 లో టిడిపి నుండి గెలిచిన అంబటి బ్రాహ్మణయ్య మరణంతో జరిగిన ఉప ఎన్నిక లో ఆయన కుమారుడు హరి ప్రసాద్ గెలుపొందారు. ఇక, 2012 ఉప ఎన్నికల తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి.
12 సార్లు ఎన్నికలు జరిగితే..
అవనిగడ్డ నియోజకవర్గంలో మొత్తంగా 12 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ ఏడు సార్లు, టిడిపి అయదు సార్లు గెలుపొందారు. 20009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిన మండలి బుద్దప్రసాద్ 2014 ఎన్నికలకు ముందు గా టిడిపిలో చేరారు. అయిదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న మండలి కుటుంబ సభ్యుడు అయిన బుద్ద ప్రసాద్ టిడిపిలో చేరి 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసారు.

2014 లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 196401 ఓటర్లు ఉండగా, అందులో 167616 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన మండలి బుద్ద ప్రసాద్ కు 80995 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన సింహాద్రి రమేష్ కు 75037 ఓట్లు వచ్చాయి. టిడిపి నుండి పోటీ చేసిన మండలి బుద్దప్రసాద్ 5958 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ గెలిచిన మండలి బుద్ద ప్రసాద్ రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన ఏపి తొలి శాసనసభకు డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications