ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: బనగానపల్లె నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజన లో బాగంగా గతంలో ఉన్న కోయిలకుంట్ల రద్దై బనగానపల్లె కేంద్రంగా బనగానపల్లె నియోజకవర్గం ఏర్పాటైంది. కోయిలకుంట్ల, అవుకు, సంజమాల,కొలిమిగుండ్ల మండలాలు ఈ నియోజకవర్గం లో చేరా యి. రద్ద అయిన కోయిలకుంట్లలో మాజీ ఉప ముఖ్యమంత్రి ..మాజీ స్పీకర్ అయినర బివి సుబ్బారెడ్డి నాలుగు సార్లు గెలు పొందారు. అందులో కూడా రెండు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుండి ప్రజారా జ్యం అభ్యర్ధి గెలుపొందారు. పాణ్యం నుండి అయిదు సార్లు గెలిచిన కాటసాని రాంభూపాల్ రెడ్డి సోదరుడు కాటసాని రామి రెడ్డి. ఇక, 2014 ఎన్నికల నాటికి ఇక్కడి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. వైసిపి పార్టీ ఏర్పాటు తో ఇక్కడ కొత్త రాజకీయా వర్గాలు మొదలయ్యాయి.
15 సార్లు ఎన్నికలు.. స్పష్టమైన తీర్పు..
1952 లో కోయిలకుంట్ల నియోజకవర్గం ఏర్పాటైంది. అప్పటి నుండి 2004 వరకు జరిగిన ఎన్నికల్లో ఆరు సార్లు కాంగ్రెస్ అభ్యర్ధులు గెలుపొందారు. నాలుగు సార్లు టిడిపి గెలిచింది. సోషలిస్టు పార్టీ ఒకసారి, స్వతంత్ర అభ్యర్ధి ఒకసారి గెలుపొం దారు. 2009 లో బనగానపల్లె నియోజకవర్గంగా మారిన తరువాత 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం గెలవగా.. 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ది పై టిడిపి గెలిచింది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుండి గెలిచిన కాటసారి రామిరెడ్డి ఆ తరువాతి రాజకీయ సమీకరణాల్లో వైసిపి లో చేరారు. కర్నూలు జిల్లా నుండి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం రెండు అసెంబ్లీ నియోకవర్గాల్లో గెలు పొందింది.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2009 లో ప్రజారాజ్యం నుండి గెలిచిన కాటసాని రామిరెడ్డి 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి గా బనగానపల్లె నుండి పోటీ చేసారు. టిడిపి నుండి పోటీ చేసిన బిసి జనార్ధనరెడ్డి..కాటసాని రామిరెడ్డి పై గెలుపొందారు. ఆ ఎన్నికల్లో మొత్తం 216578 మంది ఓటర్లు ఉండగా, 178652 ఓట్లు పోలయ్యాయి. అందులో టిడిపి అభ్యర్ధి జనార్దనరెడ్డికి 95727 ఓట్లు రాగా, వైసిపి అభ్యర్ది కాటసాని రామిరెడ్డికి 78386 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ధి 17341 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక, గెలిచిన తరువాత జనార్ధనరెడ్డి స్థానికంగా సమస్యల పై ప్రభుత్వ అధికారులతోనే అనేక సందర్భాల్లో వాగ్వాదానికి దిగారు. జనార్ధనరెడ్డి టిడిపిని వీడుతారనే ప్రచారం సైతం జరిగింది. అయితే, కర్నూలు జిల్లాలో 2014 ఎన్నికల్లో టిడిపి మూడు స్థానాలు గెలవగా అందులో బనగానపల్లె ఒకటి.












Click it and Unblock the Notifications