ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: చింత‌ల‌పూడి -(ఎస్సీ) నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌న‌లో భాగంగా ఈ సెగ్మెంట్ జ‌న‌ర‌ల్ నుండి ఎస్సీ రిజ‌ర్వ్ గా మారింది. జంగారెడ్డి మండ లాన్ని కొత్త‌గా ఇందులో చేర్చారు. ఇక్క‌డ నుండి సీనియ‌ర్ నేత కోట‌గిరి విద్యాధ‌ర రావు అయిదు సార్లు గెలిచారు.2009 లో రిజ‌ర్వ్ గా మార‌టంతో ఉంగుటూరులో పోటీ చేసి ఓడిపోయారు. 2004 లో ఆయ‌న తొలిసారి చింత‌ల‌పూడి లో ఓడిపో యారు. ఆయ‌న ప‌దేళ్ల పాటు మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. 2008 లో ప్ర‌జారాజ్యం కు మారారు. ఇక‌, 2009 లో ఇక్క‌డి నుండి యువ‌కుడైన సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ అయిన రాజేశ్ కాంగ్రెస్ నుండి పోటీ చేసి గెలుపొందారు. ఈ నియోక‌వ‌ర్గం ఏలూరు లోక్‌స‌భ ప‌రిధిలోకి వ‌స్తుంది.

13 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే..
చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు 13 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ అయిదు సార్లు, టిడిపి అయిదు సార్లు, సిపిఐ ఒక‌సారి, ఇద్ద‌రు స్వ‌తంత్రులు గెలిచారు. 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ గెలిచిన రాజేష్ ఆ త‌రువాత వైసిపి లో చేరారు. 2014 లో రాజేష్ స‌తీమ‌ణి దేవీప్రియ ఇక్క‌డ నుండి వైసిపి అభ్య‌ర్ధిగా పోటీ చేసారు. టిడిపి నుండి గ‌తంలో ఆచంట నుండి గెలిచిన పీత‌ల సుజాత పోటీ చేసారు.

AndhraPradeshElections2019: All about Chintalapudi (SC) Constituency

2014 ఎన్నిక‌ల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తంగా 240021 ఓట్లు ఉండ‌గా, అందులో 201521 ఓట్లు పోల‌య్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన పీత‌ల సుజాత కు 105417 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన దేవీప్రియ కు 90258 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి అభ్య‌ర్ది పీత‌ల సుజాత 15164 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నిక‌ల్లో గెలిచిన త‌రువాత చంద్రబాబు నాయుడు ప్ర‌భుత్వంలో పీత‌ల సుజాత 2017 ఏప్రిల్ వ‌ర‌కు మంత్రిగా ప‌ని చేసారు. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో భాగంగా మంత్రి ప‌ద‌వి నుండి తొలిగించి..ఇదే జిల్లా నుండి పితాని స‌త్య‌నారాయ‌ణ‌, జ‌వ‌హ‌ర్ ల‌కు అవ‌కాశం ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+