ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: చీరాల నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పెద్దగా మార్పులు లేని నియోజకవర్గం ఇది. గతంలో ఉన్న చీరాల మున్సి పాలిటీ, చీరాల మండలం, వేటపాలెం మండలాలు యధాతధంగా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ప్రముఖ చేనేత నేత ప్రగడ కోటయ్య ఈ నియోకవర్గం నుండి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి నుండి రోశయ్య రెండు సార్లు గెలిచారు..ఆయన నాలుగు సార్లు శాసనమండలికి , ఒకసారి నరసరావుపేట ఎంపిగా ఎన్నికయ్యారు. సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేసిన రికార్డు ఆయన సొంతం. 1978-83 దాకా, అలాగే 1989-94 వరకు . తిరిగి 2004 నుండి 2009 వరకు మం త్రి గా వ్యవహరించారు. 2009 లో వైయస్ మరణం తరువాత ఏపి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక, ప్రగడ కోటయ్య ఇక్కడి నుండి ఒకసారి, చీరాల లో మూడు సార్లు గెలిచారు. ఒక సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
చీరాల లో 15 సార్లు ఎన్నికలు..
చీరాల నియోజకవర్గంలో ఇప్పటి వరకు మొత్తం 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ ఏడు సార్లు, టిడిపి నాలుగు సార్లు, జనతా, కెఎమ్‌పిపి,సిపిఐ ఒక్కొక్కసారి గెలిచాయి. ఇకసారి నవోదయా పార్టీ గెలిచింది. 2004 లో ఇక్కడి నుండి గెలిచిన రోశయ్య 2009 నాటికి ఎమ్మెల్సీ అయ్యారు. 2009 లో వైయస్ ఆకస్మిక మరణం తరువాత రోశయ్య ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2012 నవంబర్ వరకు ఆయన సీయంగా వ్యవహరించారు. ఆ తరువాత రోశయ్య ను తమిళనాడు గవర్నర్ గా నియమించారు. శాసనమండలి ప్రతిపక్ష నేతగా, పిసిసి చీఫ్ గా రోశయ్య వ్యవహరించారు. ఇక, 2009 ఎన్నికల్లో ఇక్కడి నుండి ఆమంచి కృష్ణ మహన్ కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచారు.

2014 లో నవోదయా పార్టీ గెలుపు..
2014 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 190044 ఉండగా, అందులో 154180ఓట్లు పోలయ్యాయి. నవో దయా పార్టీ నుండి పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ కు 57544 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన పోతుల సునీత కు 47209 ఓట్లు వచ్చాయి. నవోద యా పార్టీ అభ్యర్ధి ఆమంచి కృష్ణమోహన్ 10335 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ వైసిపి నుం డి పోటీ చేసిన బాలాజీ కి 40995 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎన్నికల్లో గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ ఆ తరు వాత అధికార పార్టీ టిడిపి కి మద్దతుగా నిలిచారు.












Click it and Unblock the Notifications