ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: దెందులూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో నియోజకవర్గాల పునర్విభనలో భాగంగా పెదవేగి, ఏలూరు మండలంలోని 13 గ్రామాలు ఈ నియోకవర్గంలో కలిసా యి. ప్రభుత్వ విప్ గా ఉన్న చింతమనేని ప్రభాకర్ ఇక్కడ వరుసగా రెండో సారి గెలుపొందారు. 2004 లో ఇక్కడ కాంగ్రెస్ నుండి గెలిచిన మాగంటి బాబు నాటి వైయస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. జిల్లాలో జడ్‌పిటిసి లో ఓటమి తో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో..అవమానంగా భావించిన మాగంటి బాబు కాంగ్రెస్ వీడి టిడిపిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఏలూరు ఎంపీగా ఉన్నారు. ఆయన తండ్రి మాగంటి రవీంద్రనాధ్ చౌదరి 1989 లో గెలిచి నాటి నేదరుమల్లి క్యాబినెట్‌లో మంత్రిగా ప్రమణ స్వీకారం చేసారు. ఆ తరువాత కొద్ది సేపటికే గుండె పోటుతో మరణించారు. తండ్రి, తల్లి, కుమారుడు ముగ్గురూ మంత్రులుగా పని చేసిన కుటుంబం గా ఖ్యాతి దక్కించుకున్నారు. ఇక, 2009 ఎన్నికల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా మారిన రాజకీయ సమీకరణాలు ఇక్కడ ప్రభావం చూపించాయి.
14 సార్లు ఎన్నికలు..
ఉంగుటూరు లో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ ఏడు సార్లు, టిడిపి ఆరు సార్లు, స్వతం త్ర అభ్యర్ది ఒకసారి గెలిచారు. ఇక్కడ నాలుగు సార్లు గెలిచిన గారపాటి సాంబశివరావు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు సమీప బంధువు. 2009 లో కాంగ్రెస్ అభ్యర్ది రామచంద్ర రావు పై టిడిపి నుండి పోటీ చేసిన చింతమనేని ప్రభాకర్ గెలుపొం దారు. 2014 ఎన్నికల నాటికి ఇక్కడ త్రిముఖ పోటీ జరిగినా టిడిపి గెలుపొందింది. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుండి తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు వైసిపి నుండి పోటీ చేసారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ మొత్తంగా 197861 ఓట్లు ఉండగా, అందులో 170861 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన చింతమనేని ప్రభాకర్ కు 92209 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన కారుమూరి నాగేశ్వరరావుకు 74463 ఓట్లు వచ్చాయి. టిడిపి నుండి పోటీ చేసిన చింతమనేని ప్రభాకర్ 17746 ఓట్ల మోజార్టీతో గెలుపొందారు. ఇక్కడ గెలిచిన తరువాత ప్రభాకర్ కు విప్ పదవి దక్కింది.












Click it and Unblock the Notifications