ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: గన్నవరం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పాటైంది. పి గన్నవరం, అంబాజీపేట, ఐనవిల్లి మండలాలు పూర్తిగా ఈ నియోకవర్గం లో చేరాయి. ఇక్కడ ఇప్పటి వరకు 2009,2014 లో ఎన్నికలు జరిగాయి. 2009 లో రద్ద యిన నగరం నియోజకవర్గంలో టిడిపి నుండి ఉండ్రు కృష్ణారావు మూడు సార్లు గెలుపొందారు. గణపతిరావు, మహాలక్ష్మి రెండు సార్లు చొప్పున గెలిచారు. 1994 లో జరిగిన ఉప ఎన్నికలో టిడిపి అభ్యర్దిగా గెలిచిన నారాయణ మూర్తి 2009 లో ఓడి పోయారు. 2004 , 2009 లో కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసిన పాముల రాజేశ్వరీ దేవి రెండు సార్లు గెలుపొందారు. 2014 నాటికి ఇక్కడ కొత్త అభ్యర్దులు తెర మీదకు వచ్చారు.
11 సార్లు ఎన్నికలు జరిగితే..
నగరం నియోజకవర్గంలో 11 సార్లు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు కాంగ్రెస్ అభ్యర్దులు గెలిచారు. నాలుగు సార్లు టిడిపి గెలు పొందింది. ఒకసారి బిజెపి అభ్యర్ది నెగ్గారు. ఇక, గన్నవరం నియోజకవర్గం లో ఒకసారి కాంగ్రెస్, ఒకసారి టిడిపి గెలిచాయి. 2014 ఎన్నికల నాటికి టిడిపి - వైసిపి మధ్య ప్రధాన పోటీ జరిగింది.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 183100 ఓట్లు ఉండగా, అందులో 142024 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన నారాయణ మూర్తికి 74967 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన చిట్టిబాబు కు 61462 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది నారాయణ మూర్తి 13505 ఓట్ల మోజార్టీతో గెలుపొందారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేశ్వరి మరో సారి కాంగ్రెస్ నుండి పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు.












Click it and Unblock the Notifications