ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా కంభం , ఆర్ద‌వీడు మండ‌లాలు పూర్తిగా చేరాయి. అలాగే బెస్త‌వారిపేట మం డ‌లానికి చెందిన 9 గ్రామాలు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చేరాయి. పిడ‌త‌ల కుటుంబానికి గ‌ట్టి ప‌ట్టు ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గం లో పిడ‌త‌ల రంగారెడ్డి నాలుగుసార్లు, కంభంలో మరోసారి గెలుపొందారు.ఈయ‌న కుమారుడు విజ‌య‌కుమార రెడ్డి ఒక‌సారి, కోడ‌లు సాయి క‌ల్ప‌నారెడ్డి మ‌రోసారి గెలిచారు. రంగారెడ్డి సోద‌రుడు రాంభూపాల్ రెడ్డి ఒక‌సారి నెగ్గారు. రంగారెడ్డి మంత్రి గా , స్పీక‌ర్ గా, పిసిసి అధ్య‌క్షుడిగా ప‌ని చేసారు. 2009 ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జారాజ్యం 18 సీట్లు గెల‌వ‌గా, ప్ర‌కాశం నుండి గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌టి మాత్ర‌మే గెలిచింది. అన్నా వెంక‌ట రాంబాబు ప్ర‌జారాజ్యం అభ్య‌ర్దిగా ఇక్క‌డి నుండి గెలుపొందారు.

14 సార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా..
గిద్ద‌లూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి 14 సార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా కాంగ్రెస్ నాలుగుసార్లు, టిడిపి నాలుగుసార్లు, జ‌న‌తా పార్టీ, ప్ర‌జారాజ్యం, వైసిపి ఒక్కోసారి గెలిచాయి. స్వ‌తంత్రులు మూడు సార్లు గెలుపొందారు. ప్ర‌జారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీ నం కావ‌టంతో 2009 లో గెలిచిన అన్నా రాంబాబు సైతం కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు ఇక్క‌డి నుండి ప్ర‌జారాజ్యం అభ్య‌ర్దిగా గెలిచిన అన్నా రాంబాబు టిడిపి లో చేరారు. ఆయ‌న‌కు గిద్ద‌లూరు టిక్కెట్ కేటాయించారు. 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న టిడిపి అభ్య‌ర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నిక‌ల స‌మ‌యానికి ఇక్క‌డి స‌మీక‌ర‌ణాల్లో భారీ మా ర్పు క‌నిపించింది.

#AndhraPradeshElections2019: All about Giddalur Constituency

2014 లో వైసిపి గెలుపు..
గిద్ద‌లూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో మొత్తం 226925 ఓట్లు ఉండ‌గా, అందులో 181104 ఓట్లు పోల‌య్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన అశోక్ రెడ్డికి 94413 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన రాంబాబుకు 81520 ఓట్లు వ‌చ్చాయి. వైసిపి నుండి పోటీ చేసిన అశోక్ రెడ్డి 12893 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్క‌డ నుండి గెలిచిన అశోక్ రెడ్డి ఆ త‌రువాత అధికార టిడిపిలోకి ఫిరాయించారు. టిడిపి అభ్య‌ర్దిగా ఓడిన అన్నా రాంబాబు కొద్ది కాలం క్రితం వైసిపి లో చేరారు. దీంతో..గ‌త ఎన్ని క‌ల్లో పోటీ చేసిన ఇద్ద‌రు అభ్య‌ర్దులు ఇప్పుడు ప్ర‌త్య‌ర్ధి పార్టీలో ఆశావాహులుగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+