ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: గోపాలపురం (ఎస్సీ) నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గోపాలపురం, ద్వారకా తిరుమల, నల్లజర్ల, దేవరపల్లె మండలాలు ఈ గోపాలపురం నియోజకవర్గంలో చేరాయి. ఈ నియోజకవర్గంలో జొన్నకూటి బాబాజీ రావు రెండు సార్లు టిడిపి నుండి ఎ మ్మెల్యేగా గెలుపొందారు. ఆయన కుమార్తె వనిత సైతం 2009 లో ఇక్కడి నుండి గెలిచారు. ఇక్కడ నుండి రెండుసార్లు గెలిచిన రాఘవులు గతంలో కాసు మంత్రివర్గంలో పని చేసారు. రాఘవులు కొవ్వూరు లో సైతం ఒకసారి గెలుపొందారు. కారుపాటి వివేకానంద ఇక్కడ మూడు సార్లు గెలిచి ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పని చేసారు. 2009 లో ఇక్కడి నుండి గెలిచిన టి వనీత ఆ తరువాత మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా వైసిపి లో చేరారు.
12 సార్లు ఎన్నికలు జరిగితే..
గోపాలపురం నియోకవర్గానికి ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో టిడిపి ఏడు సార్లు, కాంగ్రెస్ నాలు గు సార్లు విజయం సాధించాయి. ఒకసారి స్వతంత్ర అభ్యర్ది గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ఇక్కడ టిడిపి అభ్యర్దిగా పోటీ చేసిన వనిత కాంగ్రెస్ నుండి పోటీ చేసిన ఉష పై 14653 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో తిరిగి వనిత వైసిపి నుండి పోటీ చేసారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 214379 ఓట్లు ఉంటే..అందులో 189103 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన ఎం వెంకటే శ్వర రావు కు 95299 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన వెంకటరావుకు 83759 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది వెంకటేశ్వర రావు 11540 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.












Click it and Unblock the Notifications