Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా నందివాడ‌, గుడ్ల‌వ‌ల్లేరు మండ‌లాల‌ను పూర్తిగా గుడివాడ‌లో క‌లిపేసారు. గ తంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న పామ‌ర్రు, పెద‌పారుపూడి మండ‌లాల‌ను పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గంలో చేర్చారు. ఇక‌, ఈ నియోజ‌క‌వ‌ర్గం లో మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావు ప్రాతినిధ్యం వ‌హించారు. 1983,85 లో ఇక్క‌డి నుండి ఎన్టీఆర్ గెలు పొందారు. 1985 లో మూడు చోట్ల గెలిచిన ఘ‌న‌త ఎన్టీఆర్ సొంతం. టిడిపి ఆవిర్భావం త‌రువాత ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో రెండు సార్లు మిన‌హా ప్ర‌తీ సారి టిడిపి గెలుస్తూ వ‌చ్చింది. 2204, 2009 లో టిడిపి నుండి గెలిచిన కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు 2009 లో గెలిచిన త‌రువాత రాష్ట్రంలో మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో భాగంగా వైసిపి లో చేరారు. ఆ త‌రువాత అన‌ర్హ‌త వేటు కు గురై వైసిపి నుండి 2014 లో పోటీ చేసారు.

17 సార్లు ఎన్నిక‌లు..
గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు 17 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ ఆరు సార్లు, టిడిపి ఎనిమిది సార్లు, సిపిఐ రెండు సార్లు, వైసిపి ఒక‌సారి గెలిచాయి. ఇక్క‌డ నుండి రాజ‌కీయంగా పేరున్న రావి కుటుంబం నాలుగు సా ర్లు గెలిచింది. రావి శోభ‌నాద్రి చౌద‌రి రెండు సార్లు గెలిచారు. ఆయ‌న పెద్ద కుమారుడు హ‌ర‌గోపాల్ ఒక‌సారి గెలుపొందారు. అయితే హ‌ర‌గోపాల్ గెలిచిన కొద్ది కాలానికే రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌టంతో ఆయ‌న సోద‌రుడు వెంక‌టేశ్వ‌ర‌రావు ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచారు. 2004 లో ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేసిన కొడాలి వెంక‌టేశ్వ‌రావు తిరిగి 2009 లోనూ టిడిపి నుండే గెలిచారు.

AndhraPradeshElections2019: All about Gudivada Constituency

2014 ఎన్నిక‌ల్లో వైసిపి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తంగా 197311 ఓట్లు ఉండ‌గా, అందులో 157682 ఓట్లు పోల‌య్యాయి. వైసిపి నుండి పో టీ చేసిన కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావుకు 81298 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన రావి వెంక‌టేశ్వ‌ర‌రావుకు 69761 ఓట్లు వ‌చ్చాయి. వైసిపి నుండి పోటీ చేసిన కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు 11537 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+