ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కనిగిరి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా హనుమంతునిపాడు, కనిగిరి మండలాలు పూర్తిగా ఈ నియోజకవ ర్గంలో చేరాయి. టిడిపి ఆవిర్భావం తరువాత ఈ నియోజకవర్గంలో రాజకీయంగా మార్పులు చోటు చేసుకున్నాయి. ము క్కు కాశిరెడ్డి ఇక్కడ మూడు సార్లు గెలిచారు. ఆయన గతంలో ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా కొంత కాలం పని చేసారు. ఇరిగినేని తిరుపతినాయుడు మూడు సార్లు, ప్రముఖ సిపిఐ నేత గుజ్జుల యల్లమందారెడ్డి రెండు సార్లు గెలిచారు. యల మందారెడ్డి లోక్‌సభ సభ్యుడిగానూ వ్యవహరించారు. పులి వెంకటరెడ్డి కనిగిరలో ఒక సారి, ఉదయగిరిలో మరోసారి శానన సభకు , మూడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల సమయంలో ఇక్కడ విచిత్రమైన సంఘటన చోటు చేసు కుంది. దీని కారణంగా ప్రధాన పార్టీ అయిన టిడిపి అభ్యర్ది బరిలో లేకుండా పోవాల్సి వచ్చింది. దీంతో, అక్కడ స్వతంత్ర అభ్యర్దికి టిడిపి మద్దతు ఇచ్చింది.
14 సార్లు ఎన్నికలు..
కనిగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు సార్లు, టిడిపి నాలుగు సార్లు, సిపిఐ మూడు సార్లు, స్వతంత్ర అభ్యర్ది ఒకసారి గెలుపొందారు. 2009 ఎన్నికల సమయంలో టిడిపి నుండి సినీ నిర్మాత కదిరి బాబురావు నామినేషన్ దాఖలు చేసారు. అయితే, సాంకేతిక కారణాలతో ఆ నామినేషన్ తిరస్కరించారు. బాబురావు నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితులు. ఇక, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి కొత్త అభ్యర్దిగా ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల నాటికి ఇక్కడ కొత్త రాజకీయం చోటు చేసుకుంది.

2014 ఎన్నికల్లో ..
కనిగిరి నియోకవర్గంలో 2014 ఎన్నికల్లో మొత్తం 207766 ఓట్లు ఉండగా, అందులో 158609 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసి న కదిరి బాబూరావుకు 79492 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన మధుసూధన రావుకు 72285 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది కది రి బాబూరావు 7207 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి 2663 ఓట్లు మాత్రమే దక్కాయి. ఇక, ప్రస్తుత రాజకీయాల్ల ఉగ్ర నరసింహా రెడ్డి టిడిపి నుండి పోటీ చేస్తారని సమాచారం . ఈ మేరకు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications