ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కోడూరు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న త‌రువాత రాజంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని పెన‌గ‌లూరు, పుల్లంపేట మండ‌లా లు కోడూరు నియోజ‌క‌వ‌ర్గంలో చేరాయి. గ‌తంలో ఇక్క‌డి నుండి గెలిచిన స‌ర‌స్వంతి టిడిపి ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌ని చేసారు. గుంటి శ్రీరాములు, తూమాటి పెంచ‌ల‌య్య‌, రెండేసి సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 లో కాంగ్రెస్ నుండి గెలిచి న వెంక‌టేశ్వ‌ర ప్ర‌సాద్ ను కాద‌నివై..2009 ఎన్నిక‌ల్లో కొత్త‌గా కె శ్రీనివాసులును నాటి ఎన్నిక‌ల్లో వైయ‌స్ అభ్య‌ర్ధిగా ఖ‌రారు చేసారు. టిడిపి - వైసిపి హోరా హోరీగా 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ త‌ల‌ప‌డ్డాయి. ఇక‌, ఈ నియోక‌వ‌ర్గంలో స్థానిక స‌మీక‌ర‌ణాలే అభ్య‌ర్ధుల గెలుపు ఓట‌ములు మీద ప్ర‌భావం చూపిస్తాయి. దీంతో..పోటీలో ఉన్న అభ్య‌ర్దులు స్థానిక స‌మీక‌ర‌ణాల‌ను అను గుణంగా త‌మ వ్యూహాల‌ను సిద్దం చేసుకుంటున్నారు.

14 సార్లు ఎన్నిక‌లు.. 1.76 ల‌క్ష‌ల ఓట‌ర్లు..

కోడూరు నియోజ‌క‌వర్గం 1962 లో ఏర్పాటైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తంగా 14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగా యి. అందులో కాంగ్రెస్ 4 సార్లు, టిడిపి అయిదు సార్లు, స్వతంత్ర అభ్య‌ర్ధులు రెండు సార్లు, వైసిపి రెండు సార్లు, జ‌న‌తా పార్టీ ఒక‌సారి విజ‌యం సాధించాయి. 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్దిగా పోటీ చేసి గెలుపొందిన కె శ్రీనివాసులు ఆ త‌రువా త చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల్లో భాగంగా జ‌గ‌న్ తో క‌లిసి..వైసిపి లో చేరారు. 2012 లో జరిగిన ఉప ఎన్నిక‌ల్లో వైసిపి అభ్య‌ర్దిగా గెలుపొందారు. ఆ త‌రువా 2014 లోనూ వైసిపి నుండే పోటీ చేసారు. కాగా, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2014 ఎన్ని క‌ల లెక్క‌ల ప్ర‌కారం 176660 ఓట‌ర్లు ఉన్నారు.

#AndhraPradeshElections2019: All about Kodur Constituency

2014 లో 77 శాతం పోలింగ్ న‌మోదు..వైసిపి విజ‌యం..

2014 లో కోడూరు నియోజ‌క‌వ‌ర్గం లో వైసిపి - టిడిపి మ‌ధ్య హోరా హోరీ పోరు సాగింది. ఇక్క‌డ మొత్తం 176660 ఓట‌ర్లు ఉండ‌గా.. 136541 ఓట్లు పోల‌య్యాయి. అందులో పురుష ఓట‌ర్లు 66015 కాగా, మ‌హిళా ఓట‌ర్ల సంఖ్య 70526 గా లెక్క‌లు తేల్చారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం లో 77.29 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇక‌, వైసిపి అభ్యర్ది శ్రీనివాసులు కు 66820 ఓట్లు రాగా, టిడిపి అభ్య‌ర్ది సుబ్బ‌రామ‌య్య కు 64848 ఓట్లు ద‌క్కాయి. ఈ ఎన్నిక‌ల్లో వైసిపి అభ్య‌ర్ధి శ్రీనివాసులు 1972 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎస్సీ వ‌ర్గాల స‌మ‌స్య‌ల పై శ్రీనివాసులు స‌భ‌లో గ‌ళం విప్పేవారు. ఇక‌, నియోజ‌క‌వ ర్గంలో పార్టీ యాక్టివిటీలో శ్రీనివాసులు క్రియా శీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+