ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కొత్తపేట నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఆలమూరు మండలం చేరింది. గతంలో రెండు సార్లు టిడిపి నుండి పోటీ చేసి గెలిచి..మరో రెండు సార్లు ఓడిన 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్దిగా ఇక్కడి నుండి గెలుపొందారు. సోమసుం దర రెడ్డి కాంగ్రెస్ నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కుమారుడు జగ్గిరెడ్డి 2004 లో కాంగ్రెస్ నుండి గెలిచి 2009 లో ఓడారు. 2014 లో వైసిపి లో చేరి ఇక్కడి నుండి బరిలో నిలిచారు. ఇక్కడ నుండి నాలుగు సార్లు గెలుపొందని సు బ్బరాజు జనతాపార్టీ అధ్యక్షుడిగానూ పని చేసారు. ఆయన బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో పని చేసారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇక్కడ ప్రజారాజ్యం కు స్వల్ప మెజార్టీ దక్కింది.
14 సార్లు ఎన్నికలు జరిగితే..
ఇక్కడ ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ ఏడు సార్లు, టిడిపి నాలుగుసార్లు, జనతా పార్టీ ఒక సారి, ప్రజారాజ్యం ఒకసారి, వైసిపి ఒకసారి గెలిచాయి. 2004,2009,2014 లో బరిలో ప్రధాన పోటీ జరిగిన ఇద్దరు అభ్యర్దులు వేర్వేరు పార్టీల నుండి ప్రాతినిధ్యం వహించారు. 2009 లో ప్రజారాజ్యం నుండి గెలిచిన సత్యానందరావు తిరిగి 2014 లో టిడిపి నుండి పోటీ చేసారు. కాంగ్రెస్ నుండి ఒకసారి గెలిచి, మరోసారి ఓడిన జగ్గిరెడ్డి 2014 లో వైసిపి నుండి పోటీ చేసారు.

2014 లో వైసిపి గెలుపు..
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 223296 ఓట్లు ఉండగా, అందులో 187436 ఓట్లు పోలయ్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన జగ్గిరెడ్డికి 88357 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన సత్యానందరావుకు 87644 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్ది జగ్గిరెడ్డి 713 ఓట్ల మెజార్టీతో గెలు పొందారు.












Click it and Unblock the Notifications