ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కోవూరు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

బంధువులు..రాజ‌కీయ వ‌ర్గ పోరు..ఎత్తుల‌కు పై ఎత్తులు..ఇలా..అస‌లు సిస‌లు రాజీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ నెల్లూరు జిల్లా కోవూరు నియోజ‌క‌వ‌ర్గం. ఇదే నియోజ‌క‌వ‌ర్గం లో న‌ల్ల‌పురెడ్డి కుంటుంబానికి ప్ర‌త్య‌క స్థానం ఉంది. న‌ల్ల‌పురెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు జిల్లాలోని ఈ నియోజ‌క‌వ‌ర్గంతో పాటుగా గూడూరు, వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల నుండి అయిదు సార్లు ఎమ్మె ల్యేగా గెలిచారు. ఆయ‌న ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా ప‌ని చేసారు. ఆయ‌న త‌న‌యుడు ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి సైతం టిడిపి నుండి గెలిచి తిరుగుబాటు ఎగ‌ర‌వేసి వైసిపి లో చేరారు. ప్ర‌స్త‌త మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న రెడ్డి ఈయ‌న‌కు స‌మీప బంధువు. ఇక‌, గ‌తంలో కాంగ్రెస్ లో ఉన్న పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి టిడిపి లో చేరి 2014 లో గెలుపొందారు.

1952 నుండి కోవూరు రాజ‌కీయాలు..

నెల్లూరు జిల్లా కోవూరు నియోజ‌క‌వ‌ర్గం 1952 లో ఏర్పాటైంది. ఇప్ప‌టి వ‌ర‌కు 14 సార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా కాంగ్రెస్‌, కాంగ్రెస్ ఆరుసార్లు ఇక్క‌డ ఎన్నిక‌లు గెలుపొందింది. ఏడు సార్లు టిడిపి అభ్య‌ర్ధుల గెలుపొందారు. ఒక సారి సిపిఐ గెలిచింది. కాగా, 2014 ఎన్నిక‌ల్లో పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వైసిపి అభ్య‌ర్ది న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి పై గెలుపొందారు. ఇక్క‌డి నుండి కాంగ్రెస్ -టిడిపి మ‌ధ్య ప్ర‌తీ ఎన్నిక‌ల్లోనూ ప్ర‌తిష్ఠాత్మ పోరు కొన‌సాగుతూనే ఉంది. న‌ల్ల‌పురెడ్డి కుటుంబం టిడిపి .. అక్క‌డి నుండి కాంగ్రెస్..న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి టిడిపి నుండి గెలిచి వైసిపి లోకి చేరారు. 2012 లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో వైసిపి నుండి ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి త‌న స‌మీప బంధువు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న రెడ్డి పై గెలిచారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల్లో టిడిపి ఇక్క‌డి నుండి గెలిచి ప‌ట్టు నిరూపించుకుంది.

#AndhraPradeshElections2019: All about KOVURU Constituency

2.50 లక్ష‌ల ఓట‌ర్లు.. 2014 లో టిడిపి గెలుపు..
కోవూరు నియోజ‌క‌వ‌ర్గంలో 2014 ఎన్నిక‌ల లెక్క‌ల ప్ర‌కారం 240902 ఓట‌ర్లు ఉండ‌గా, అందులో 198129 ఓట్లు పోల‌య్యా యి. ఇక‌, టిడిపి నుండి పోటీ చేసిన పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి 94108 ఓట్లు రాగా, స‌మీప అభ్య‌ర్ధి వైసిపి అభ్య‌ర్ధి అయిన న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న కుమార్ రెడ్డికి 86171 ఓట్లు పోల‌య్యాయి. ఈ ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్ధి 7937 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు. ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్ధికి 19155 ఓట్ల మెజార్టీ ద‌క్కింది. 2009 నియోజ‌క వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న త‌రువాత మారిన కొన్ని ప్రాంతాల చేరిక‌లు..తీసివేత‌ల‌తో బుచ్చిరెడ్డి పాలెంలోని తొమ్మ‌ది గ్రామా ల తో పాటుగా అల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఉండే అయిదు గ్రామాలు సైతం కోవూరు లో చేరాయి. దీంతో, రాజ‌కీయంగా పార్ట‌ల బ‌లాబ‌లాల పై ప్ర‌భావం చూపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+