ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజక‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా పూర్వం ఉన్న కొవ్వూరు, తాళ్ల‌పూడి మండ‌లాల య‌ధాత‌ధంగా ఉన్నాయి. చాగ‌ల్లు మండ‌లం గోపాల‌పురం నియోజ‌క‌వ‌ర్గం నుండి కొత్త‌గా వ‌చ్చి చేరింది. 1952 లో ఏర్ప‌డిన కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం 2009 డీ లిమిటేష‌న్ లో భాగంగా ఎస్సీ రిజర్వ్ అయింది. ఇక్క‌డ నుండి అల్లూరి బాపీనీడు, ఎమ ఏ అజీజ్, పెండ్యాల వెం క‌ట కృష్ణారావు, జీఎయ‌స్ రావు లాంటి ప్ర‌ముఖులు ప్రాతినిధ్యం వ‌హించారు. కొవ్వూరు లో అత్య‌ధికంగా పెండ్యాల వెంక ట కృష్ణారావు అయిదు సార్లు గెలిచారు. అల్లూరి బాపినీడు రెండు సార్లు గెలుపొందారు. ఇక్క‌డి నుండి గెలిచిన టివి రాఘ వులు, గోపాల పురం నుండి రెండు సార్లు నెగ్గారు. 2009 లో ఎస్సీ రిజ‌ర్వ్ గా ఆమ‌రిన త‌రువాత తొలి సారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్ది గెలుపొందారు. 2014 లో టిక్కెట్ రాక‌పోవ‌టం తో రెబ‌ల్ గా బ‌రిలో నిలిచారు.

14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే..
కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు 14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ నాలుగు సార్లు, టిడిపి ఆరు సార్లు, కెఎమ్‌పిపి ఒక‌సారి, ఇద్ద‌రు స్వ‌తంత్రులు గెలిచారు. ఇక్క‌డి నుండి 2009 లో గెలిచిన జీఎస్ రావు కొద్దికాలం పిసిసి అధ్య‌క్షుడిగా ప‌ని చేసారు. అజీజ్ గ‌తంలో అంజ‌య్య‌, భ‌వ‌నం, కోట్ల మంత్రి వ‌ర్గాల్లో ప‌ని చేసారు. టివి రాఘువులు కొంత కాలం మంత్రిగా ఉన్నారు. 2009 లో ఇక్క‌డ గెలిచిన రామారావు ఆయ‌న‌కు స‌మీప బంధువు. ఇక, 2009 ఎన్నిక‌ల త‌రువాత రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల్లో గోపాల‌పురం నుండి టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన వ‌నిత వైసిపి లో చేరా రు. అదే విధంగా కాంగ్రెస్ లో మోషేన్ రాజు వైసిపి లో కొన‌సాగుతున్నారు.

AndhraPradeshElections2019: All about Kovvur Constituency

2014 ఎన్నిక‌ల్లో టిడిపి గెలుపు..
2014 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తం గా 168810 ఓట్లు ఉండ‌గా, అందులో 113056 ఓట్లు పోల‌య్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన జ‌వ‌హ‌ర్ కు 74661 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన వ‌నిత కు 61916 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి అభ్య‌ర్ది జ‌వ‌హ‌ర్ 12745 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు. ఉపాధ్యాయుడిగా ప‌ని చేసిన జ‌వ‌హ‌ర్ అనూహ్యంగా 2014 ఎన్నిక‌ల్లో టిడిపి నుండి గెలిచారు. 2017 లో జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో క్యాబినెట్ బెర్తు ద‌క్కించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+