ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: మార్కాపురం నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా మార్కాపురం, పొదిలి మండ‌లాలు పూర్తిగా మార్కాపురం నియోజ క వ‌ర్గంలో క‌లిశాయి. ఇక్క‌డ కాంగ్రెస్ నేత కెపి కొండారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప‌ల‌క‌ల కేంద్రంగా ప్ర‌సిద్ది గాంచిన మార్కాపురం 1967 వ‌న‌కు క‌ర్నూలు జిల్లాలో ఉండేది. 1972 నాటికి ప్ర‌కాశం జిల్లాలో భాగ‌మైంది. ఇక్క‌డ రెండు సార్లు గెలిచిన కందుల ఓటుబ‌ల‌రెడ్డి కంభం, ఎర్ర‌గొండ‌పాలెంలో ఒక్కోసారి గెలిచారు. మార్కాపురం లో ఒక‌సారి గెలిచిన సిపిఐ నేత పూల సుబ్బ‌య్య‌, ఎర్ర‌గొండ పాలెం లో రెండు సార్లు విజ‌యం సాధించారు. ఎర్ర‌గొండ‌పాలెం లో ఒక‌సారి గెలిచి న జంకె రామిరెడ్డి, మ‌ర్కాపురంలో రెండు సార్లు గెలిచిన వెంక‌ట‌రెడ్డి తండ్రి..కుమారులు. 1983 లో గెలిచిన వివి నారాయ‌ణ రెడ్డి నాదెండ్ల ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌ని చేసారు.

14 సార్లు ఎన్నిక‌లు..
మార్కాపురం నియోజ‌క‌వ‌ర్గానికి ఇప్ప‌టి వ‌ర‌కు 14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ ఆరు సార్లు, టిడిపి రెండు సార్లు, కెఎల్పి రెండు సార్లు, సిపిఐ ఒక‌సారి, వైసిపి ఒక‌సారి. స్వ‌తంత్రులు రెండు సార్లు గెలుపొందారు. చ‌ప్పిడి వెంగ‌య్య ఇక్క‌డ ఒక‌సారి కందుల ఓబుల‌రెడ్డిని, కంభంలో మ‌రోసారి ఓబుల్‌రెడ్డి కుమారుడు నాగార్జున‌రెడ్డిని ఓడించారు. మ‌రోసారి నాగార్జున రెడ్డి చేతిలో వెంగ‌య్య ఓడిపోయారు. 2009 వ‌ర‌కు ఒక విధంగా సాగిన రాజ‌కీయాలు..2014 నాటికి పూర్తిగా మారిపో యాయి. కొత్త స‌మీక‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌య్యాయి.

#AndhraPradeshElections2019: All about Markapuram Constituency

2014 లో వైసిపి గెలుపు..
2014 ఎన్నికల్లో మార్కాపురం నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 199162 ఓటర్లు ఉండ‌గా, అందులో161349 ఓట్లు పోల‌య్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన జంకె వెంక‌ట‌రెడ్డికి 82411 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన కె నారాయ‌ణ‌రెడ్డికి 72609 ఓట్లు వ‌చ్చాయి. వైసిపి అభ్య ర్ధి వెంక‌ట‌రెడ్డి 9802 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇదే వెంక‌ట‌రెడ్డి 1994 లో స్వ‌తంత్ర అభ్య ర్దిగా ఇక్క‌డి నుండే గెలుపొందారు. టిడిపి నుండి పోటీ చేసి ఓడిన బాల నారాయ‌ణ రెడ్డి 2009 లో ఇక్క‌డి నుండి టిడిపి ఎమ్మెల్యేగా గెలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+