ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: మైదుకూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
కడప జిల్లాలో ఇప్పుడు మైదుకూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తి కర నియోజకవర్గం గా మారింది. 2009 అసెంబ్లీ నియోజకవర్గా ల పునర్విభజన లో బాగంగా.. దువ్వూరు, ఖాజీపేట, చౌపాడు మండలాలు మైదుకూరు అసెంబ్లీ నియోజవర్గంలో చేరా యి.ఈ నియోజకవర్గంలో ఇద్దరు ప్రముఖ నేతల మధ్యే రాజకీయ పోరు ఎక్కువగా సాగింది. స్వతంత్ర అభ్యర్దగా 1978 లో తొలి సారిగా ఇదే నియోజకవర్గం నుండి అసెంబ్లీ లో కాలు పెట్టిన డిఎల్ రవీంద్రారెడ్డి ఆ తరువాత కాంగ్రెస్ లో జిల్లా నేత గా ఎదిగారు. ఈ నియోకవర్గంలో ప్రధానంగా డిఎల్ రవీంద్రారరెడ్డి వర్సెస్ రఘురామిరెడ్డి అన్నట్లుగా రాజకీయం ఎంతో కాలంగా కొనసాగుతోంది. డిఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్ నుండి అయిదు సార్లు, స్వతంత్ర అభ్యర్ధిగా ఒకసారి గెలుపొందారు. కాగా, రెండు సార్లు ఓడిపోయారు. ఇక, రఘురామిరెడ్డి రెండు సార్లు టిడిపి నుండి ఒకసారి వైసిపి నుండి గెలవగా, మరో నాలుగు సార్లు ఓటమి పాలయ్యారు.
13 సార్లు ఎన్నికలు..
1955 నుండి ఇప్పటి వరకు మైదుకూరు నియోజకవర్గంలో మొత్తంగా 13 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ ఎనిమిది సార్లు గెలవగా.. టిడిపి రెండు సార్లు గెలిచింది. ఇక, స్వతంత్రులు రెండు సార్లు, వైసిపి అభ్యర్ది ఒకసారి గెలిచారు. ఇదే నియోజకవర్గంలో టిడిపి నుండి గతంలో పోటీ చేసి 2014 లో వైసిపి లో చేరి డిఎల్ రవీంద్రారెడ్డి పై వైసిపి నుండి రఘురామిరెడ్డి గెలిచారు. ఇక, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా ఉన్న పుట్టా సుధాకరఖ యాదవ్ 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.

2014 ఎన్నికల్లో 83 శాతం పోలింగ్..వైసిపి విజేత..
2014 లో జరిగిన ఎన్నికల లెక్కల ప్రకారం ఇక్కడ మొత్తం 195092 ఓటర్లు ఉందగా, 2014 ఎన్నికల్లో 163566 ఓట్లు పోల య్యాయి. అందులో 80465 పురుష ఓటర్లు ఉండగా, 83101 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం పోలింగ్ 83.84 శాతం గా నమోదైంది. ఈ ఎన్నికల్లో వైసిపి నుండి పోటీ చేసిన రఘురామిరెడ్డికి 85539 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన సుధాకర్ యాదవ్ కు 74017 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్ది 11522 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.












Click it and Unblock the Notifications