ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: న‌ర్సాపురం నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా మొగ‌ల్తూరు..న‌ర్సాపురం మండ‌లాలు పూర్తిగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చేరా యి. టిడిపి ఆవిర్భావం త‌రువాత తొలిసారి ఇక్క‌డ 2009 లో కాంగ్రెస్ గెలిచింది. ఈ నియోజ‌క‌వర్గంలో కొత్త‌ప‌ల్లి సుబ్బారా యుడు అయిదుసార్లు గెలుపొందారు. ఆయ‌న నాలుగు సార్లు టిడిపి నుండి 2012 ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుండి గెలిచా రు. మాజీ మంత్రి హ‌రిరామ జోగ‌య్య ఇక్క‌డి నుండి టిడిపి అభ్య‌ర్దిగా రెండు సార్లు గెలిచారు. 1996 లో సుబ్బారాయుడు లోక్‌స‌భ కు ఎన్నిక కాగా, శాస‌న‌స‌భ‌కు రాజీనామా చేసారు. ఆయ‌న ఎన్టీఆర్ ఆ త‌రువాత చంద్ర‌బాబు క్యాబినెట్‌లో మంత్రి గా ప‌ని చేసారు. వైయ‌స్ మ‌ర‌ణం త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల్లో ఇక్క‌డి సమీక‌ర‌ణాలు..పార్టీల్లో చేరిక‌లు జ‌రిగాయి. ఈ ప్ర‌భావం 2014 ఎన్నిక‌ల పై ప‌డింది.

16 సార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా..
న‌ర్సాపురం నియోజ‌క‌వ‌ర్గం లో ఇప్ప‌టి వ‌ర‌కు 16 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ ఏడు సార్లు గెలిచింది. టిడిపి ఏడు సార్లు గెలుపొందింది. సిపిఐ, సిపియం చెరో సారి గెలిచాయి. ప‌ర‌కాల శేషావ‌తారం ఇక్క‌డి నుండి రెండు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కాంగ్రెస్ అభ్య‌ర్దిగా గెలిచిన ప్ర‌సాద రాజు వైయ‌స్ మ‌ర‌ణం త‌రువాత జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా వైసిపి లో చేరారు. 2012 లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు కాంగ్రెస్ అభ్య ర్దిగా పోటీ చేసి వైసిపి నుండి బ‌రిలో ఉన్న ప్ర‌సాద రాజును ఓడంచారు. తిరిగి 2014 ఎన్నిక‌ల ముందు వైసిపి లో చేరారు.

AndhraPradeshElections2019: All about Narasapuram Constituency

2014 ఎన్నిక‌ల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో న‌ర్సాపురం నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తంగా 155643 ఓట్లు ఉండ‌గా, అందులో 129153 ఓట్లు పోల‌య్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన బండారు మాధ‌వ‌నాయుడుకు 72747 ఓట్లు రాగా, వైసిపి అభ్య‌ర్ది సుబ్బారాయుడుకు 51035 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి అభ్య‌ర్ది మాధ‌వ‌నాయుడు 21712 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైసిపి నుండి పోటీ చేసి ఓడిన సుబ్బారాయుడు ఆ త‌రువాత టిడిపిలో చేరారు. ప్ర‌స్తుతం ఏపి కాపు కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ గా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+