ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నూజివీడు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ఇక్క‌డ నూజివీడు, ముసునూరు, ఆగిరిప‌ల్లి మండ‌లాలు య‌ధాత‌ధంగా కొన‌సాగుతున్నాయి. కొత్త‌గా చాట్రాయి మండ‌లం వ‌చ్చి చేరింది. నూజివీడు జ‌మీందారుగా పేరున్న మేకా రంగ‌య్య‌ప్పా రావు ఇక్క‌డి నుండి అయిదుసార్లు గెలుపొందారు. ఆయ‌న మంత్రిగా ప‌ని చేసారు. 1989 లో టిడిపి నుండి పోటీ చేసి ఓడి పోయారు. ఇక్క‌డ నుండి సీనియ‌ర్ కాంగ్రెస్ నేత దివంగ‌త పాల‌డుగు వెంక‌ట్రావు రెండు సార్లు గెలిచారు. ఆయ‌న ఎమ్మె ల్సీగానూ ప‌ని చేసారు. 2004 లో జ‌మీందారు కుటుంబీకుడు అయిన మేకా వెంట‌క ప్ర‌తాప అప్పారావు కాంగ్రెస్ నుండి గెలిచి 2009 లో ఓడిపోయారు. 2009 లో ఇక్క‌డి నుండి టిడిపి అభ్య‌ర్దిగా గెలిచిన రామ‌కోట‌య్య ఆ త‌రువాత కాంగ్రెస్ లో చేరారు. ఇక‌, 2009 త‌రువాత ఇక్క‌డ రాజ‌కీయా ప‌రిణామాల్లో మార్పులు జ‌రిగాయి.

14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే..
నూజివీడు నియోజ‌క‌వ‌ర్గానికి ఇప్ప‌టి వ‌ర‌కు 14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే అందులో కాంగ్రెస్ ఎనిమిది సార్లు,టిడిపి నాలుగు సార్లు,వైసిపి ఒక‌సారి, స్వ‌తంత్ర అభ్య‌ర్ధి ఒక‌సారి గెలుపొందారు. బిల్డ‌ర్ గా ఉన్ని చిన్నం రామ‌కోట‌య్య 2009 లో ప్ర‌జారా జ్యం లో చేరారు. అయితే టిక్కెట్ రాక‌పోవ‌టంతో టిడిపిలో చేరి 2009 ఎన్నిక‌ల్లో గెలుపొందారు. ఆ త‌రువాత టిడిపికి దూ ర‌మైన ఆయ‌న కాంగ్రెస్‌లో చేరారు. ఇక‌, గ‌న్న‌వ‌రం నుండి స్వ‌తంత్ర అభ్య‌ర్దిగా గెలిచిన ముద్ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావు టిడిపిలో చేరి ఇక్క‌డి నుండి 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేసారు.

AndhraPradeshElections2019: All about Nuzvid Constituency

2014 ఎన్నిక‌ల్లో..
2014 ఎన్నిక‌ల్లో నూజివీడు నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తంగా 214700 ఓట్లు ఉండ‌గా, అందులో 187921 ఓట్లు పోల‌య్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన మేకా వెంక‌ట ప్ర‌తాప్ అప్పారావు కు 95565 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన ముద్ర‌బో యిన వెంక‌టేశ్వ‌ర‌రావు కు 85168 ఓట్లు వ‌చ్చాయి. వైసిపి అభ్య‌ర్ది అప్పారావు 10397 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+