ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ప్ర‌కాశం జిల్లా కేంద్ర‌మైన ఒంగోలు లో కొత్త‌ప‌ట్నం మండ‌లం పూర్తిగా చేరింది. ఆంధ్ర‌రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన ఆంధ్ర‌కేస‌రి టంగుటూరి ప్ర‌కాశం పంతులు ఇక్క‌డ నుండి ఒక సారి గెలిచారు. ప్ర‌కాశం పంతులు మ‌ర‌ణం త‌రువాత స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగా బివి లక్ష్మీనారాయ‌ణ రెండు సార్లు గెలుపొందా రు. క‌మ్యూనిస్టు యోధులు మాదాల నారాయ‌ణ‌స్వామి నాయుడు, కె మాల‌కొండ‌య్య లు ఇక్క‌డి నుండే శాస‌న‌స‌భ‌కు ప్రాతి నిధ్యం వ‌హించారు. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని శ్రీనివాసులు రెడ్డి 2009 లో గెలిచిన త‌రువాత మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. అనూహ్య ప‌రిస్థితుల్లో మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసారు. ఆ త‌రువా త ఇక్క‌డి రాజకీయ ప‌రిస్థితుల్లో మార్ప‌లు జ‌రిగాయి.

15 సార్లు ఎన్నిక‌లు ..
ఒంగోలు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఇప్ప‌టి వ‌ర‌కు 15 సార్లు ఎన్నిక‌లు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ ఎనిమిది సార్లు, టిడిపి నాలుగుసార్లు, సిపిఐ ఒక‌సారి, స్వ‌తంత్ర అభ్య‌ర్ధి రెండు సార్లు, వైసిపి ఒక్క‌సారి గెలుపొందాయి. 1999 నుండి వ‌రుస‌గా మూడు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని శ్రీనివాస రెడ్డి 2009 లో మంత్రి అయ్యారు. వైయ‌స్‌, రోశ‌య్య క్యాబినెట్ లో ప‌ని చేసారు. అవిశ్వాసానికి మ‌ద్దతు ఇచ్చి అన‌ర్హ‌త‌కు గుర‌య్యారు. 2012 లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో వైసిపి అభ్య‌ర్దిగా పోటీ చేసి టిడిపి అభ్య‌ర్ధి దామ‌చ‌ర్ల జ‌నార్ధ‌న్ పై గెలుపొందారు.

#AndhraPradeshElections2019: All about Ongole Constituency

2014 ఎన్నిక‌ల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో మొత్తంగా 233896 ఓట్లు ఉండ‌గా, అందులో 180622 ఓట్లు పోల య్యాయి. టిడిపి అభ్య‌ర్ధి దామ‌చ‌ర్ల జ‌నార్ధ‌న్ కు 93025 ఓట్లు రాగా, వైసిపి అభ్య‌ర్దికి బాలినేని వాసుకు 80597 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి అభ్య‌ర్ది దామ‌చ‌ర్ల జ‌నార్ధ‌న్ కు 12428 ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. ఎన్నిక‌ల్లో గెలిచిన త‌రువాత సైతం ఇద్ద‌రు నేత‌లు ఇక్క‌డ ప‌ట్టు పెంచుకోవ‌టం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+