ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పాలకొల్లు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పాలకొల్లు మండలం ఈ నియోజకవర్గంలో కలిసింది. అదే విధంగా పొదూ రు మండలానికి చెందిన ఏడు గ్రామాలు పాలకొల్లులో కలిపారు. ప్రజారాజ్యం అధినేత..ప్రముఖ సినీ హీరో చిరంజీవి ఇదే నియోజకవర్గానికి చెందిన వారు. ఆయన ఈ నియోజకవర్గంలో 2009 లో పోటీ చేసి ఓడిపోవటం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఇదే నియోజకవర్గం నుండి మాజీ మంత్రి హరిరామజోగయ్య ఇక్కడి నుండి రెండు సార్లు, నర్సాపురం నుం డి రెండు సార్లు నెగ్గారు. అందె సత్యనారాయణ మూర్తి రెండు సార్లు గెలిచారు. హరి రామ జోగయ్య అటు టిడిపి.. ఇటు కాం గ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేసారు. ప్రజారాజ్యం లోనూ పని చేసారు. ఇక్కడ ఓడిన చిరంజీవి అదే ఎన్నికల్లో తిరుప తి నుండి గెలుపొంది శాసనసభలో అడుగు పెట్టారు.
13 సార్లు ఎన్నికలు జరిగితే..
పాలకొల్లు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ ఆరు సార్లు గెలిచింది. టిడిపి ఆరు సార్లు గెలిచింది. ఒక సారి సిపియం అభ్యర్ధి గెలుపొందారు. అల్లు రామలింగయ్య అయిన చిరంజీవి ఇక్కడ ఓడి పోతే ఆయన సమీప బంధువు అల్లు వెంటక సత్యనారాయణ ఇక్కడి నుండి నాలుగు సార్లు గెలుపొందారు. 2009 తరువాత జరి గిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ప్రజారాజ్యం ను కాంగ్రెస్ లో విలీనం చేసారు. ఫలితంగా చిరంజీవి రాజ్యసభ సభ్యుడి గా ..కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో పాలకొల్లు స్థానంలో మొత్తం 170409 ఓట్లు ఉండగా, అందులో 141301 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన రామానాయుడుకు 51787 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన మేకా శేషుబాబుకు 45991 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది రామానాయుడు 6383 ఓట్ల మెజార్టీతో గెలిచారు. శేషుబాబు శాసన మండలి సభ్యుడిగా ఉంటూ నే ఎమ్మెల్యేగా పోటీ చేసారు.












Click it and Unblock the Notifications