ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పెనమలూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభనలో భాగంగా పెనమలూరు కొత్తగా ఏర్పాటైంది. కంకిపాడు, ఉయ్యూరు మండలాలు పూర్తి గా పెనమలూరు నియోజకవర్గంలో చేరాయి. 2009 లో రద్దు అయిన ఉయ్యూరు నియోజకవర్గంలో ప్రముఖ నేత కాకాని వెం కట రత్నం మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక్కడి నుండే జనతా పార్టీ నుండి గెలిచిన వడ్డే శోభనాద్రీశ్వర రావు ఆ తరువాత టిడిపి లో చేరి ఎంపీగానూ గెలిచారు. అన్నే బాబూ రావు టిడిపి నుండి రెండు సార్లు గెలుపొందారు. ఇక, ఇదే నియోజకవర్గం నుండి మాజీ మంత్రి పార్దసారధి 2004 లో కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత డీలిమిటేష న్ లో భాగంగా ఏర్పాటైన పెనమలూరు నుండి ఆయన పోటీ చేసి 2009 లోనూ గెలుపొందారు. ఆ తరువాత చోటు చేసుకు న్న రాజకీయ పరిణామాల్లో ఇక్కడ సమీకరణాల్లో మార్పు జరిగింది.
ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో..
ఉయ్యూరు నియోజకవర్గంలో 2009 లో రద్దు అయ్యే వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ ఆరు సార్లు గెలవగా, టిడిపి నాలుగు సార్లు గెలిచింది. జనతా పార్టీ ఒకసారి, స్వతంత్రులు ఇద్దరు గెలిచారు. ఇక, 2009 లో ఏర్పాటైన పెనమలూరు లో 2009 లో కాంగ్రెస్ గెలవగా.. 2014 లో వైసిపి గెలుపొందింది. 2009 లో ఇక్కడ నుండి గెలిచిన పార్దసారధి వైసిపి లో చేరారు. ఆయనకు 2014 ఎన్నికల్లో బందరు టిక్కెట్ కేటాయించి..ఇక్కడ మరో అభ్యర్దిని బరిలోకి దించారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 233634 ఓట్లు ఉండగా, అందులో 185298 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన బోడె ప్రసాద్ కు 102880 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన విద్యాసాగర్ కు 70882 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ధి బోడె ప్రసాద్ 31448 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు. 2009 లో ఇక్కడ గెలిచిన పార్దసారధి ఈ తరువాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభు త్వంలో మంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు వైసిపి లో కీలక నేతగా ఉన్నారు.












Click it and Unblock the Notifications