ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పెందుర్తి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలు పూర్తిగా ఈ నియోజకవర్గంలో చేరాయి. డీలిమిటేషన్ తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడ ప్రజారాజ్యం గెలుపొందింది. 2004 లో గెలిచిన గురుమూ ర్తి రెడ్డి 2009 ఎన్నికల్లో గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ ఇక్క డి నుండి ఉప ఎన్నికల్లో గెలవగా.. 2004 లో విశాఖ-1 నుండి గెలిచి..పూర్తికాలం లేకుండానే మరణించారు. ఆయన తరువా త కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్ ఉప ఎన్నికలోనూ, 2009 లోనూ గెలుపొందారు. 1978 లో గెలిచిన అప్పన్న, 1989 లో గె లిచిన గురునాధరావులు తండ్రి-కొడుకులు. గురునాధరావు గతంలో నేదురుమల్లి, కోట్ల మంత్రివర్గాల్లో పని చేసారు. ఆయ న 1998 లో అనకాపల్లి నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక, 2009 ఎన్నికల తరువాత ఇక్కడ రాజకీయంగా పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
10 సార్లు ఎన్నికలు..
1967,1972 లో జామి నియోజవర్గంగా ఉండే ఈ ప్రాంతం 1978 లో పెందుర్తి నియోజవకవర్గంగా మారింది. ఇక్కడ మొత్తం పది సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో నాలుగు సార్లు టిడిపి, కాంగ్రెస్ నాలుగు సార్లు, సిపిఐ..ప్రజారాజ్యం ఒక్కోసారి గెలుపొందాయి. పరవాడ లో మూడు సార్లు గెలిచిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ 2014 ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేసారు. గత రెండు సార్లు ఆయన ఓడిపోయారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో ఇక్కడి మొత్తం 232878 ఓట్లు ఉండగా ,అందులో 181098 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన బండారు సత్యనారాయణ మూర్తికి 94581 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన గండి బాబ్జీకి 75888 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది బండారు సత్యనారాయణ మూర్తి 18648 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో గండి బాబ్జీ కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications