ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ప్రత్తిపాడు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా పూర్వం ఉన్న ఎల్లేశ్వరం, శంఖవరం, రౌతులపూడ మండలాలు అలాగే కొనసాగుతున్నాయి. ప్రత్తిపాడు మండలం పూర్తిగా ఈ సెగ్మెంట్‌లో కలిసింది. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మూడు కుటుంబాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముద్రగడ కుటుంబం ఇక్కడ ఆరు సార్లు ప్రాతినిధ్యం వహిస్తే.. పర్వత కుటుంబం నాలుగు సార్లు, పరుపుల కుటుంబీకులు మూడు సార్లు ఎన్నికయ్యారు. కాపు ఉద్యమ నేత గా గుర్తింపు ఉన్న ముద్రగడ పద్మనాభం ఇక్కడ నాలుగు సార్లు ఎన్నిక కాగా, ఆయన తండ్రి వీర రాఘవరావు రెండు సార్లు విజయం సాధిం చారు.పద్మనాభం ఒకసారి జనతా, రెండు సార్లు టిడిపి, ఒకసారి కాంగ్రెస్ పక్షాన గెలిచారు. 2014 లో స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు.
13 సార్లు ఎన్నికలు జరిగితే..
ఈ నియోకవర్గంలో ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ నాలుగు సార్లు, టిడిపి అయిదు సార్లు, జనతా పార్టీ ఒకసారి , వైసిపి ఒకసారి, స్వతంత్రులు రెండు సార్లు గెలిచారు. 1994 లో కాంగ్రెస్ పక్షాన పోటీ చేసి ఓడిపోయి న ముద్రగడ పద్మనాభం ఆ తర్వాత కొంతకాలం బిజేపి లో ఉండి 1999 నాటికి టిడిపి చేరి కాకినాడ నుండి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. ఆయన మంత్రిగానూ పని చేసారు. 2004 లో కాంగ్రెస్ నుండి గెలిచి..2009 లో ఓడిన పరుపుల సుబ్బా రావు 2014 ఎన్నికల సమయంలో వైసిపిలో చేరారు.

2014 ఎన్నికల్లో వైసిపి గెలుపు
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తంగా 184120 ఓట్లు ఉండగా , అందులో 148075 ఓట్లు పోలయ్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన పరుపుల సుబ్బారావుకు 63698 ఓట్లు రాగా, 2009 లో టిడిపి నుండి గెలిచి 2014 లో తిరిగి పోటీ చేసిన పర్వత సత్యనారాయణ మూర్తికి 60820 ఓట్లు వచ్చాయి. వైసిపి నుండి పోటీ చేసిన పరుపుల సుబ్బారావు 3418 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ వైసిపి నుండి గెలిచిన పరుపుల సుబ్బారావు టిడిపి లోకి ఫిరాయించారు.












Click it and Unblock the Notifications