ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ప్రొద్దుటూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
++2009 ఎన్నికల్లో కడప జిల్లా మొత్తం కాంగ్రెస్ హవా తో అన్ని నియోజకవర్గాలు హస్త గతం అయితే, కేవలం ప్రొద్దుటూరు మాత్రం టిడిపి గెల్చుకుంది. ఇక, 2014 లో మరోసారి టిడిపి నుండి పోటీ చేసిన వరదరాజులు రెడ్డి ఓడిపోగా తొలి సారి వైసిపి అభ్యర్ది ఇక్కడి నుండి గెలుపొందారు.
15 సార్లు ఎన్నికలు..
ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం 1952 లో ఏర్పాటైంది.ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా..అందులో కాంగ్రెస్ 9 సార్లు, టిడిపి మూడు సార్లు, స్వతంత్ర అభ్యర్ధి ఒక సారి, వైసిపి అభ్యర్ద ఒక సారి గెలుపొందారు. కాంగ్రెస్ గెలిచిన తొమ్మది సార్లలో వరదరాజులు రెడ్డి నాలుగు సార్లు గెలిచారు.ఇక్కడ ప్రజారాజ్యం అభ్యర్ధి సైతం 2014 లో గట్టి పోటీ ఇచ్చారు. ఆ పార్టీ నుండి పోటీ చేసిన నాటి ముఖ్యమంత్రి సమీప బంధువు మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి కుమారుడు మురళీధర్ 22700 ఓట్లకు పైగా సాధించారు. అయితే, ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధికి విజయం వరించింది.

2014 ఎన్నికల్లో .. 77 శాతం పోలింగ్..వైసిపి విజయం..
2014 ఎన్నికల్లో మొత్తం 232284 ఓట్లకు గాను, 180817 ఓట్లు పోలయ్యాయి. అందులో పురుష ఓటర్లు 87466 కాగా, మహిళా ఓటర్లు 93351 గా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ 77.84 శాతం పోలింగ్ నమోదైంది. వైసిపి నుండి పోటీ చేసిన రాచమల్లు శివప్రసాద రెడ్డికి 98866 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డికి 12945 ఓట్లు దక్కాయి. వైసిపి అభ్యర్ది 12945 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పార్టీ వాయిస్ బలంగా వినిపించే శివ ప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో ఆందోళన..నిరసన సమయాల్లో అనేక సందర్భాల్లో దూకుడుగా వ్యవహరించేవారు. జగన్ కుటుంబం పై ప్రతీ సందర్భంలోనూ విశ్వాసం ప్రకటించే ఆయన..నియోజకవర్గంలో అనేక సమస్యల పై ఆందోళన.. ధర్నాలు..నిరసనలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications