ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: రాజంపేట నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న ద్వారా ఒంటిమిట్ట‌, సిద్ద‌వ‌టం, సుండుప‌ల్లె, వీర‌బ‌ల్లి మండలాలు వివిధ నియోజ‌క‌వ‌ర్గాల నుండి రాజంపేట లో చేరాయి. రాజంపేట లో కాంగ్రెస్ మ‌హిళా నేత ప్ర‌భావ‌త‌మ్మ నాలుగు సార్టు గెలు పొందారు. టిడిపి నుండి రెండు సార్లు గెలిచిన ప‌సుపులేని బ్ర‌హ్మ‌య్య ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా ప‌ని చేసారు. 2009 లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన అమ‌ర్నాధ‌రెడ్డి 2012 ఉప ఎన్నిక‌ల్లో వైసిపి అభ్య‌ర్ధి గా పోటీ గెలుపొందారు. ఆ త‌రువాత 2014 ఎన్నిక‌ల్లో వైసిపి అభ్య‌ర్ధిగా టిడిపి అభ్య‌ర్ది చేతిలో ఓడిపోయారు.

16 ఎన్నిక‌లు.. రెండు ల‌క్ష‌ల‌కు పైగా ఓట‌ర్లు..

1952 నుండి రాజంపేట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఇప్పటి వ‌ర‌కు 16 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. కాంగ్రెస్ ఏడు సార్లు, 4 సార్లు టిడిపి, మూడు సార్లు స్వ‌తంత్ర అభ్య‌ర్ధులు, ఒక సారి వైసిపి, ఒక‌సారి సిబిఐ అభ్య‌ర్ధులు గెలుపొందారు. ఇక‌, ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో 2014 ఎన్నిక‌ల లెక్క‌ల ప్ర‌కారం మొత్తం ఓట‌ర్లు 209991 ఉన్నారు.

#AndhraPradeshElections2019: All about Rajampet Constituency

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..

క‌డ‌ప జిల్లాలోని మొత్తం ప‌ది అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో తొమ్మిది చోట్ల వైసిపి గెల‌వ‌గా..రాజంపేట నుండి మాత్రం టిడిపి అభ్య‌ర్ధి గెలిచారు. గ‌తంలో కాంగ్రెస్ లో ఉన్న మేడా మ‌ల్లి ఖార్జున రెడ్డి ఆ త‌రువాత ట‌డిపిలో చేరారు. ఆయ‌న 2014 ఎన్నిక ల్లో టిడిపి అభ్య‌ర్దిగా రాజం పేట నుండి పోటీ చేసారు. ఈ నియోక‌వ‌ర్గంలో మొత్తం 163959 ఓట్లు 2014 ఎన్నిక‌ల్లో పోల‌వ్వ‌గా అందులో పురుష ఓట‌ర్లు 78718 ఉండ‌గా, మ‌హిళా ఓట‌ర్ల సంఖ్య 85241 ఓట‌ర్లుగా నమోదైంది. టిడిపి అభ్య‌ర్ది మ‌ల్లిఖార్జున రెడ్డికి 83884 ఓట్లు రాగా, వైసిపి అభ్య‌ర్ది అమ‌ర్నాధ రెడ్డికి 72267 ఓట్లు ద‌క్కాయి. టిడిపి అభ్య‌ర్ది మ‌ల్లి ఖార్జున రెడ్డి 11617 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మ‌ల్లిఖార్జున రెడ్డి ప్ర‌స్తుతం ఏపి అసెంబ్లీలో విప్ గా ఉన్నారు. ఆయ‌న తండ్రి టిటిడి స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+