ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: రాజానగరం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోకవర్గాల పునర్విభజనలో భాగంగా బూరుగుపూగి రద్దయి రాజానగరం ఏర్పాటైంది. కొత్తగా రాజానగరం మండ లం ఈ సెగ్మెంట్‌లో చేరింది. బూరుగుపూడి నియోజక వర్గంలో దళిత నేత బత్తిన సుబ్బారావు రెండు సార్లు గెలిచారు. ఆ యన కడియం, ముమ్మిడివరంలో నాలుగు సార్లు గెలుపొందారు. 2004 లో ఇక్కడి నుండి గెలిచిన చిట్టూరరి రవీంద్ర, 19 96 లో రాజమండ్రి నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. బత్తిన సుబ్బారావు పివి, జలగం క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. కొత్తగా ఏర్పడిన రాజానగరం నుండి రెండు సార్లు టిడిపి గెలిచింది. 2009 ఎన్నికల్లో టిడిపి నుండి గెలిచిన పెందుర్ది వెంక టేష్ తిరిగి 2014 లోనూ సీటు దక్కించుకున్నారు. 2014 లో టిడిపి - వైసిపి మధ్య ప్రధాన పోటీ సాగింది.
12 సార్లు ఎన్నికలు జరిగితే..
ఈ నియోజవర్గంలో 12 సార్లు ఎన్నికలు జరిగితే.. ఆరు సార్లు కాంగ్రెస్ గెలవగా.. ఆరు సార్లు టిడిపి గెలిచింది. ఇక్కడ 2009 లో టిడిపి అభ్యర్ది 6936 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి విజయలక్ష్మి పోటీ చేసారు. అంతకు ముందు రాజమండ్రి రూరల్ నుండి పోటీ చేసి ఓడిపోయారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు
2014 లో జరిగిన ఎన్నికల్లో మొత్తంగా 187137 ఓట్లు ఉంటే, అందులో 159873 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన వెంకటేష్ కు 81476 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన విజయలక్ష్మీకి 72589 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది వెంకటేష్ 8887 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.












Click it and Unblock the Notifications