ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: రాజోలు (ఎస్సీ) నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా అప్ప‌టి వ‌ర‌కు జ‌న‌ర‌ల్ గా ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ రిజ‌ర్వ్ గా మారింది. కొత్త గా రాజోలు మండ‌లాన్ని పూర్తిగా ఇందులో విలీనం చేసారు. 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ప్ర‌జారాజ్యం అభ్య‌ర్ది రెండో స్థానం లో నిలిచారు. 1972 లో ఇక్క‌డ ఆ ప్రాంత ప్ర‌ముఖుడు రుద్ర‌రాజు రామ‌లింగ‌రాజు ను స్వ‌తంత్ర అభ్యర్ది గోపాల‌కృష్ణారావు ఓడించారు. టిడిపి నేత అల్లూరి వెంక‌ట సూర్య‌నారాయ‌ణ రాజు ఇక్క‌డ నుండి నాలుగు సార్లు గెలిచారు. ఈయ‌న ఉప స‌భా ప‌తిగా వ్య‌వ‌హ‌రించారు. 2004,2009 లో ఇక్క‌డ వ‌రుస‌గా కాంగ్రెస్ అభ్య‌ర్దులు గెలుపొందారు. ఇక‌, 2009 త‌రువాత ఇక్క‌డి రాజ‌కీయా ప‌రిస్థితుల్లో మార్పు క‌నిపించింది.

14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే..
ఇక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు 14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే కాంగ్రెస్ ఆరు సార్లు, టిడిపి అయిదు సార్లు గెలిచాయి. ఒక సారి స్వ‌తం త్ర అభ్య‌ర్ది, రెండు సార్లు సిబిఐ అభ్య‌ర్దులు గెలిచారు. గ‌తంలో అల్ల‌వ‌రం నుండి గెలిచిన గొల్ల‌ప‌ల్లి సూర్యారావు టిడిపి నుం డి కాంగ్రెస్ లో చేరారు. ఆయ‌న టిడిపిలో మంత్రిగా ప‌ని చేసారు. కాంగ్రెస్ లో చేరిన త‌రువాత వైయ‌స్ హ‌యాంలో మంత్రి గా ప‌ని చేసారు. 2014 లో తిరిగి టిడిపిలో చేరి రాజోలు నుండి పోటీ చేసారు.

AndhraPradeshElections2019: All about Razole (S.C) Constituency

2014 ఎన్నిక‌ల్లో టిడిపి గెలుపు
2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తం 174027 ఓట్లు ఉండ‌గా, అందులో 134874 ఓట్లు పోల‌య్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన గొల్ల‌ప‌ల్లి సూర్యారావుకు 66960 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన రాజేశ్వ‌ర‌రావుకు 62277 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి అభ్య ర్ది సూర్యారావు 4683 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నిక‌ల్లో గెలిచిన సూర్యారావు ప్ర‌విలేజ్ క‌మిటీ ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ రించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+