Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: తిరువూరు (ఎస్సీ)నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ప‌లు మార్పులు జ‌రిగాయి. ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరీలోనే కొన‌సాగుతోంది. తి రువూరు, విస్స‌న్న‌పేట మండ‌లాలు య‌ధాతథంగా ఉన్నాయి. కొత్త‌గా మైల‌వ‌రం మండ‌లం ఈ నియోజ‌క‌వ‌ర్గం లో చేరిం ది. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం 1952 నుండి 1962 వ‌రకు జ‌న‌ర‌ల్ స్థానంగా ఉంది. ఆ త‌రువాత రిజ‌ర్వ్ గా మారింది. 1952 లో తండ్రి, కొడుకులు ప‌ర‌స్ప‌రం పోటీ ప‌డ‌గా కొడుకు పేట రామారావు విజ‌యం సాధించారు. తిరిగి 1955 లో తండ్రి పేట బాప య్య కుమారుడిని ఓడించారు. కుమారుడు సిపిఐ ప‌క్షాన‌.. తండ్రి కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసారు. తిరువూరు లో రెండు సా ర్లు గెలిచిన కోనేరు రంగారావు కంకిపాడులో ఒక సారి గెలిచారు.

15 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే..
తిరువూరు లో ఇప్ప‌టి వ‌ర‌కు 15 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. కాంగ్రెస్ ఎనిమిది సార్లు, టిడిపి నాలుగుసార్లు,సిపిఐ ఒక‌సారి , వైసిపి ఒక‌సారి గెలుపొందాయి. ఒక స్వ‌తంత్ర అభ్య‌ర్ధి సైతం గెలుపొందారు. ఇక్క‌డి నుండి గెలిచిన కోనేరు రంగారావు ఉప ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసారు. స్వామిదాస్ టిడిపి నుండి రెండు సార్లు, కోట రామ‌య్య‌, పేట బాప‌య్య రెండు సార్లు చొప్పున గెలుపొందారు. 2009 వ‌ర‌కు ఇక్క‌డ కాంగ్రెస్ - టిడిపి మ‌ధ్య పోటీ ఉండేది. 2009 త‌రువాత రాష్ట్రంలో చోటు చేసు కున్న రాజ‌కీయ ప‌రిణాల ప్ర‌భావం ఇక్క‌డా ప‌డింది.

AndhraPradeshElections2019: All about Tiruvuru (SC) Constituency

2014 లో వైసిపి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తంగా 187066 ఓట్లు ఉండ‌గా, అందులో162726 ఓట్లు పోల‌య్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన ర‌క్ష‌ణ‌నిధికి 78144 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన స్వామిదాస్ కు 76468 ఓట్లు వ‌చ్చాయి. వైసిపి నుండి పోటీ చేసిన ర‌క్ష‌ణ‌నిధి 1676 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+