ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: తుని నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా తుని, కోట‌నందూరు మండ‌లాలు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చేరాయి. 1983 లో టిడిపి ఆవిర్బావం త‌రువాత ఇక్క‌డ వ‌రుస‌గా ఆరు సార్లు ప్ర‌స్తుత మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు గెలిచారు. 2009 ఎన్నిక ల్లో ఇక్క‌డి నుండి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్య‌ర్ది ఆర్‌వివి కృష్ణంరాజు వ‌రుస‌గా మూడు సార్లు ఓడి..2009 లో య‌న‌మ‌ల ను ఓడించారు. కాంగ్రెస్ అభ్య‌ర్దిగా రాౠ వివికె బ‌హ‌దూర్ ఇక్క‌డ నుండి నాలుగు సార్లు గెలిస్తే , ఆయ‌న కుమార్తె విజ‌య‌ల క్ష్మీ రెండు సార్లు గెలిచారు. మ‌రో రెండు సార్లు య‌న‌మ‌ల పై పోటీ చేసి ఓడిపోయారు. య‌న‌ల‌మ సుదీర్ఘ కాలం మంత్రిగా .. స్పీక‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. ఇదే జిల్లా నుండి ఒకే కాలంలో లోక్‌సభ స్పీక‌ర్‌గా బాల‌యోగి...ఏపి స్పీక‌ర్ గా య‌న‌మ‌ల రామ కృష్ణుడు వ్య‌వ‌హ‌రించ‌టం ఆరుదైన విష‌యం.

14 సార్లు ఎన్నిక‌లు జరిగితే..
తుని లో ఇప్ప‌టి వ‌ర‌కు 14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ ఏడు సార్లు గెల‌వ‌గా, టిడిపి ఆరు సార్లు గెలిచిం ఇ. వైసిపి ఒక సారి గెలుపొందింది. 2009 ఎన్నిక‌ల త‌రువాత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు శాస‌న‌మండ‌లి లో విప‌క్ష నేత‌గా ఉన్నారు. ఆ త‌రువాతి ఎన్నిక‌ల్లో తుని నుండి ఆయ‌న సోదుడు పోటీ చేసారు. మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల్లో ఇక్క‌డ నుండి వైసిపి బ‌రిలో దిగింది.

AndhraPradeshElections2019: All about Tuni Constituency

2014 ఎన్నిక‌ల్లో..
2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తం 197694 ఓట్లు ఉండ‌గా, అందులో 159970 ఓట్లు పోల‌య్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన య‌న‌మ‌ల కృష్ణుడు కు 66182 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన రాజా కు 84755 ఓట్లు వ‌చ్చాయి. వైసిపి అభ్య‌ర్ది రాజా 18573 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 లో టిడిపి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మ‌రోసారి ఆర్దిక మంత్రిగా ప్ర‌స్తుతం కొన‌సాగుతున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో..
ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసిపి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తిరిగి పోటీ చేయ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. టిడిపి నుండి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు సోద‌రుడే మ‌రో సారి బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ గా ఉన్నారు. ఇక‌, 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ పోటీ చేసిన ప్ర‌జారాజ్యం అభ్య‌ర్ది రొంగ‌లి ల‌క్ష్మీ కి 30079 ఓట్లు వ‌చ్చాయి. తూర్పు గోదావ‌రి జిల్లాలో జ‌న‌సేన త‌న ప్ర‌భావం చూపుతుంద‌ని అంచ‌నా. ఇక్క‌డ జ‌న‌సేన అభ్య‌ర్దిని ఖ‌రారు చేయాల్సి ఉంది. ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త్రిముఖ పోటీ నెల‌కొని ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+