ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఉండి నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా కొద్ది పాటి మార్పులు జ‌రిగాయి. ఉండి, క‌ల్లా, ఆకివీడు మండ‌లా లు అలాగే కొన‌సాగుతుండ‌గా, భీమ‌వ‌రం నియోక‌వ‌ర్గం నుండి పాల‌కోడేరు మండ‌లం కొత్త‌గా వ‌చ్చి చేరింది. ఉండి చాలా కాలం టిడిపికి కంచుకోట‌గా ఉంది. టిడిపి ఆవిర్భావం త‌రువాత తొలిసారి 2004 లో కాంగ్రెస్ గెలిచింది. 1983 నుండి 1999 వ‌ర‌కు అయిదు సార్లు గెలిచిన ఘ‌న‌త క‌లిదిండి రామ‌చంద్ర‌రాజు కు ద‌క్కింది. ఆయ‌న ఎన్టీఆర్ ఆ త‌రువాత చంద్ర‌బాబు వ‌ద్ద మంత్రిగా ప‌ని చేసారు. 2004 లో ఇక్క‌డ కాంగ్రెస్ అభ్య‌ర్ది పాత‌పాటి స‌ర్రాజు రామ‌చంద్ర‌రాజు మీద గెలిచారు. తిరిగి 2009 ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్ది చేతిలో స‌ర్రాజు ఓడిపోయారు. ఆ త‌రువాత ఇక్క‌డి స‌మీక‌ర‌ణాల్లో మార్పు క‌నిపించింది.

15 సార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా..
ఉండి నియోజ‌క‌వ‌ర్గానికి ఇప్ప‌టి వ‌రకు 15 సార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా..అందులో ఆరు సార్లు కాంగ్రెస్ గెలిచింది. టిడిపి ఏడు సార్లు గెలుపొందింది. రెండు సార్లు స్వ‌తంత్ర స‌భ్యులు గెలిచారు. ఇక‌, 2009 లో గెలిచిన శివ‌రామ రాజు తిరిగి 2014 లోనూ టిడిపి నుండి పోటీ చేసారు. గ‌తంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప‌ని చేసిన స‌ర్రాజు వైసిపి లో చేరి పోటీ చేసారు.

AndhraPradeshElections2019: All about Undi Constituency

2014 లో టిడిపి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తం 202201 ఓట్లు ఉండ‌గా, అందులో 173397 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన శివ‌రామ‌రాజు కు 101530 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన స‌ర్రాజుకు 65299 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి అభ్య‌ర్ది శివ‌రామ రాజు 36231 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+