ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా న‌గ‌రంలోని కొంత భాగంతో సెంట్ర‌ల్ నియోజక‌వ‌ర్గం ఏర్ప‌డింది. విజ‌య వాడ తూర్పు నుండి గ‌తంలో గెలిచి ప్ర‌జారాజ్యం లో చేరిన వంగ‌వీటి రాధా ఇక్క‌డ 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్ది చేతి లో ఓడిపోయారు. వంగ‌వీటి రాధాకృష్ణ విజ‌య‌వాడ తూర్పు నుండి ఒకసారి గెలిచ‌న మోహ‌న రంగా, రెండు సార్లె గెలిచిన ర‌త్న‌కుమారి ల కుమారుడు. 1988 లో రంగా హ‌త్య‌కు గుర‌య్యారు. 2009 లో ర‌ద్దు అయిన కంకిపాడు నియోజ‌క‌వ‌ర్గం లో దేవినేని రాజ‌శేఖ‌ర్ అయిదు సార్లు గెలిచారు. ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా ప‌ని చేసారు. ఎన్టీఆర్ మ‌ర‌ణం త‌రువాత కాంగ్రెస్ లో చేరి 2004 లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కంకిపాడు నుండి ఒక‌సారి గెలిచిన య‌ల‌మంచిలి నాగేశ్వ‌రరావు, 2009 లో విజ‌య‌వాడ తూర్పు నుండి గెలిచిన ర‌వి లు తండ్రి..కుమారులు.

గ‌త ఎన్నిక‌ల్లో..
కంకిపాడు లో 1952 నుండి 2004 వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో అయిదు సార్లు టిడిపి గెల‌వ‌గా, అయిదు సార్లు టిడిపి గెలిచింది. రెండు సార్లు సిపిఐ, ఒక‌సారి కెఎల్‌పి గెలుచుకున్నాయి. ఇక‌, కంకిపాడు లో 2009 లో కాంగ్రెస్ అభ్య‌ర్ది మ‌ల్లాది విష్ణు గెల‌వ‌గా , 2014 లో టిడిపి గెలిచింది.2009 త‌రువాత విజ‌య‌వాడ న‌గర రాజ‌కీయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అదే విధంగా అభ్య‌ర్దులు సైతం పార్టీలు మారి బ‌రిలో నిలిచారు.

AndhraPradeshElections2019: All about Vijayawada Central Constituency

2014 ఎన్నిక‌ల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ లో మొత్తంగా 259001 ఓట్లు ఉండ‌గా, అందులో 169448 ఓట్లు పోల‌య్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు కు 82669 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన గౌతం రెడ్డికి 55508 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి నుండి పోటీ చేసిన ఉమా మ‌హేశ్వ‌ర‌రావు 27161 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ త‌రువాత టిడిపి ప్ర‌భుత్వం లో ఉమా కు టిటిడి బోర్డు స‌భ్యుడిగా నియ‌మించారు. వైసిపి నుండి పోటీ చేసిన గౌతం రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌టంతో ఆయ‌న్ను పార్టీ కొంత కాలం సస్పెండ్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+