ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: విజయవాడ పశ్చిమం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా విజయవాడ అర్బన్ మండలంలోని కొంత భాగంతో విజయవాడ వెస్ట్ గా ఏర్పాటు చేసారు. ఇక్కడ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం అభ్యర్ది 2009 లో గెలుపొందారు. 1967 నుండి ఇక్కడ ఏ అభ్యర్ధి రెండో సారి గెలిచిన సందర్బాలు లేవు. కాంగ్రెస్ నుండి 199లో గెలిచిన జలీల్ ఖాన్ తిరిగి 2014 లో ఇక్కడి నుం డి గెలుపొందారు. ఇక్కడ గెలిచిన అజీజ్ పాషా, ఎంకె బేగ్‌లు మంత్రులు పని చేసారు. తొలుత 1952 లో విజయవాడ ని యోజకవర్గం గా ఉండేది. 1955, 1962 ఎన్నికలు విజయవాడ ఉత్తరం పేరుతో ఈ నియోజకవర్గంలో జరిగాయి. 1967 నుండి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంగా ఏర్పడింది. ఇక, డీలిమిటేషన్ తరువాత నగరంలోని కొత్త ప్రాంతాలు ఇందులో చే రాయి. ఇక్కడ రాజకీయంగా చైతన్యం ఎక్కువ.
ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో..
విజయవాడ పశ్చిమంలో ఇప్పటి వరకు జరిగిన 11 ఎన్నికల్లో కాంగ్రెస్ అయిదు సార్లు, సిపిఐ మూడు సార్లు, టిడిపి ఒక సారి, ప్రజా రాజ్యం ఒకసారి, వైసిపి ఒకసారి గెలిచాయి. అయితే, 2009 ఎన్నికల తరువాత ఇక్కడి సమీకరణాల్లో మార్పులు జరిగాయి. 2009 లో ఇక్కడ ప్రజారాజ్యం అభ్యర్ది గా వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలిచారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కా వటంతో..ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక, వైయస్ మరణం..వైసిపి ఏర్పాటు..రాష్ట్ర విభజన కారణంగా రాజకీ య సమీకరణాల్లో ఇక్కడ మార్పులు కనిపించాయి. ఇక, 2014 లో టిడిపి- పొత్తు కారణంగా ఇక్కడ బిజెపి పోటీ చేసింది. మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస రావు బిజెపి నుండి పోటీ చేసారు.

2014 ఎన్నికల్లో వైసిపి గెలుపు..
2014 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం గా 236860 ఓట్లు ఉండగా, అందులో 153243 ఓట్లు పోల య్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన జలీల్ ఖాన్‌కు 63180 ఓట్లు రాగా, బిజెపి అభ్యర్ది వెల్లంపల్లి శ్రీనివాస రావుకు 60072 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్ది జలీల్ ఖాన్ కు 3108 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన జలీల్ ఖాన్ ఆ తరువాత టిడిపిలో చేరి నామినేటెడ్ పోస్టు దక్కించుకున్నారు. బిజెపి నుండి పోటీ చేసి ఓడిన వెల్లంపల్లి శ్రీనివాస రావు బిజెపి నుండి వైసిపి లో చేరారు.












Click it and Unblock the Notifications