ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న లో భాగంగా ..విశాఖ న‌గ‌రంలోని ప‌లు డివిజ‌న్ల‌తో పాటుగా పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుండి కొన్ని డివిజ‌న్లు..విశాఖ రూర‌ల్ లోని కొంత భాగం క‌లిసి ఈ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డింది. విశాఖ న‌గ‌రంలో పున‌ర్విభ జ‌న త‌ర్వాత అయిదు నియోజక‌వ‌ర్గాలు ఏర్ప‌డ్డాయి. అందులో ఒక‌టైన విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి వ‌రుస‌గా రెండు సార్లు గెలిచింది.

రెండు సార్లు ఎన్నిక‌లు..
2009 లో ఏర్పాటైన ఈ నియోజ‌క‌వ‌ర్గం లో టిడిపి నుండి పోటీ చేసిన వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు కు 44,233 ఓట్లు రాగా, ప్ర‌జారాజ్యం నుండి పోటీ చేసిన సిహెచ్ శ్రీనివాస‌రావుకు 40,202 ఓట్లు వ‌చ్చాయి. 4031 ఓట్ల మెజార్టీతో వెల‌గ‌పూడి రామ‌కృ ష్ణ బాబు విజ‌యం సాధించారు. 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తం 256766 ఓట్లు ఉండ‌గా, అందులో 160411 ఓట్లు పోల‌య్యా యి. టిడిపి నుండి పోటీ చేసిన వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు కు 100624 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ కు 62741 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి అభ్య‌ర్ది వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు 47883 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

#AndhraPradeshElections2019: All about Visakhapatnam East Constituency
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+