Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: విశాఖ ఉత్త‌రం నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా పూర్తిగా విశాఖ న‌గ‌ర ప్రాంతంతో ఈ నియోజక‌వ‌ర్గం ఏర్ప‌డింది. 1955 నుం డి 1962 వ‌ర‌కు క‌ణితి నియోజ‌క‌వ‌ర్గంగా..1967 నుండి 2004 వ‌ర‌కు విశాఖ‌-2 గా ఉన్న ఈ నియోజ‌జ‌క‌వ‌ర్గం 2009 లో విశాఖ ఉత్త‌రం గా మారింది. విశాఖ -2 గా ఉన్న స‌మయం లో ఇక్క‌డ 1978 ఉండి ఏ అభ్య‌ర్ది రెండో సారి గెలిచిన సంద‌ర్భం లేదు. 1967 లో సిపిఎం అభ్య‌ర్దిగా గెలిచిన స‌న్యాసి రావు ఆ త‌రువాత స్వంతంత్ర అభ్య‌ర్దిగా గెలిచారు. 2004 లో గెలిచిన రంగ రాజు కు ఆ త‌రువాతి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ టిక్కెట్ నిరాక‌రించింది. విశాఖ ఉత్త‌రం గా ఏర్ప‌డిన త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ రెండు సార్లు ఎన్నిక‌లు జరిగాయి. 2009 ఎన్నిక‌ల తరువాత రాష్ట్ర విభ‌జ‌న ప్ర‌భావం ఇక్క‌డ క‌నిపించింది. దీంతో.. ఎన్నిక‌ల ఫ‌లితాల్లో స్ప‌ష్టంగా మార్పు క‌నిపించింది.

11 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే..
విశాఖ -2 లో 1967 నుండి 2004 వ‌ర‌కు 9 సార్లు ఎన్నిక‌లు జరిగాయి. అందులో కాంగ్రెస్ రెండు సార్లు, టిడిపి నాలుగు సార్లు, జ‌న‌తా, సిపిఎం, స్వ‌తంత్ర అభ్య‌ర్దులు ఒక్కోసారి గెలుపొందారు. ఇక‌, 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుండి కాంగ్రెస్ అభ్య‌ర్దిగా పో టీ చేసిన టి విజ‌య్ కుమార్‌ ప్ర‌జారాజ్యం నుండి పోటీ చేసిన ర‌హ్మాన్ పై విజ‌యం సాధించారు. 2009 త‌రువాత జ‌రిగిన రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా 2014 ఎన్నిక‌ల్లో మ‌రోసారి కాంగ్రెస్ నుండి పోటీ చేసిన ద్రోణంరాజు శ్రీనివాస్ కు డిపాజిట్ ద‌క్క లేదు.

#AndhraPradeshElections2019: All about Visakhapatnam North Constituency

2014 ఎన్నిక‌ల్లో బిజెపి గెలుపు...
2014 ఎన్నిక‌ల్లో టిడిపి - బిజెపి పొత్తు కార‌ణంగా ఈ సీటు బిజెపి కి కేటాయించారు. ఇక్క‌డ మొత్తంగా 267215 ఓట్లు ఉం డ‌గా, అందులో 158422 ఓట్లు పోల‌య్యాయి. బిజెపి నుండి పోటీ చేసిన విష్ణుకుమార్ రాజ‌కు 82079 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన చొక్కా కుల వెంక‌ట‌రావుకు 68839 ఓట్లు పోల‌య్యాయి. బిజెపి అభ్య‌ర్ది విష్ణుకుమార్ రాజు 18240 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్క‌డ గెలిచిన విష్ణు కుమార్ రాజు బిజెపి శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+