ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా య‌ల‌మంచిలి, మున‌గ‌పాక‌, అచ్యుతాపురం మండ‌లాలు పూర్తిగా య‌ల మంచిలి నియోక‌వ‌ర్గంలో క‌లిసాయి. ఇక్క‌డ టిడిపి అభ్యర్ది ప‌ప్పుల చ‌ల‌ప‌తి రావు వ‌రుస‌గా నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. 2004, 2009 లో కాంగ్రెస్ అభ్య‌ర్ది ర‌మ‌ణ మూర్తి రాజు టిడిపి అభ్య‌ర్ది జివి నాగేశ్వ‌ర‌రావు మీద వ‌రుస‌గా రెండు సార్లు గెలిచారు. 1999 లో చ‌ల‌ప‌తి రావు కాంగ్రెస్ నుండి పోటీ చేసిన ర‌మ‌ణ మూర్తి రాజ‌ను ఓడించారు. చ‌ల‌ప‌తి రావు ఇక్క‌డ ఎమ్మెల్యేగా అదే విధంగా అన‌కాప‌ల్లి ఎంపీగా గెలిచారు. ఇక్క‌డ రెండు సార్లు విజ‌యం సాధించిన స‌న్యాసి నాయుడు కోట్ల ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌ని చేసారు. 2009 ఎన్నిక‌ల్లో జిల్లాలో ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్ర‌మే గెలిస్తే..అందులో ర‌మ‌ణ మూర్తి రాజు ఒక‌రు.

14 సార్లు ఎన్నిక‌లు..
ఇక్క‌డ మొత్తంగా 14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ నాలుగు సార్లు, టిడిపి ఆరుసార్లు, కెఎల్‌పి ఒక‌సారి, స్వ‌తంత్రులు మూడు సార్లు గెలిచారు. 2009 ఎన్నిక‌ల త‌రువాత ఇక్క‌డ స‌మీక‌ర‌ణాల్లో మార్పులు వ‌చ్చాయి. 2009 లో ప్ర‌జారాజ్యం నుండి పెందుర్తిలో గెలిచిన పంచ‌క‌ర్ల ర‌మేష్ బాబు టిడిపి లో చేరారు. ర‌మ‌ణ‌మూర్తి రాజు సైతం టిడిపిలో చేరినా సీటు ద‌క్క‌లేదు.

#AndhraPradeshElections2019: All about Yelamanchili Constituency

2014 ఎన్నిక‌ల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తం 185854 ఓట్లు ఉండ‌గా, అందులో 158587 ఓట్లు పోల‌య్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన పంచ‌క‌ర్ల ర‌మేష్ బాబుకు 80568 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన ప్ర‌గ‌డ నాగేశ్వ‌ర‌రావుకు 72108 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి అభ్య‌ర్ది పంచ‌క ర్ల ర‌మేష్ బాబు 8455 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+