జగన్ అస్త్రం: ఎన్టీఆర్ బయోపిక్‌కు పోటీగా వైఎస్ సినిమా
Recommended Video

హైదరాబాద్: ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా బాలకృష్ణ హీరోగా సినిమాను రూపొందిస్తున్న క్రమంలో దానికి పోటీ అన్నట్లుగా వైయస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అవునన్నా కాదన్నా ఎన్టీఆర్ బయోపిక్‌ను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను వచ్చే ఎన్నికల్లో వాడుకుంటారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తనకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ నిర్మాణానికి అంగీకించినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్‌కు రాజకీయాల్లో వైఎస్ పోటీ..
ఎన్టీఆర్ వారసత్వాన్ని చంద్రబాబు నాయుడు వాడుకుంటూ వస్తున్నారు. అదే రీతిలో వైయస్ రాజశేఖర రెడ్డిని వైయస్ జగన్ వాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారిద్దరికీ చాలా కాలంగా పోటీ పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి నేతల బయోపిక్‌లను చూడాల్సి ఉంటుంది.

వైఎస్ పాత్రలో మమ్ముట్టి
వైఎస్ బయోపిక్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తారనే ప్రచారం సాగుతోంది. హీరో రాజశేఖర్‌తో గతంలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ వైఎస్సార్ బయోపిక్ తీయాలని తలపెట్టారు. అయితే అది కార్యరూపం ధరించలేదు.

ఆ సినిమాకు దర్శకుడు ఇతను...
‘ఆనందో బ్రహ్మ' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహి వి. రాఘవ్ వైఎస్సార్ బయోపిక్‌కు దర్శకత్వం వహిస్తారని సమాచారం. దానికి వైఎస్సార్ కుమారుడు, వైసిపి అధినేత జగన్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. త్వరలో బయోపిక్‌కు సంబంధించిన వివరాలను రాఘవ్ ప్రకటిస్తారని అంటున్నారు.

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేర ఎన్టీ రామారావు బయోపిక్ తీయడానికి సిద్ధపడ్డారు. దానికి పోటీగా లక్ష్మీస్ వీరగంధం సినిమాను తీస్తానని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రకటించారు. మొత్తం మీద, ఇవన్నీ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రూపొందుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications