ఏపి సిఎం బాబు కొత్త(అద్దె) ఇల్లు ఇదే(ఫొటోలు)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత ఇంటిని ఖాళీ చేసి ఏప్రిల్ 12న జూబ్లీహిల్స్‌లోని అద్దె ఇంటికి మారనున్నారు. ప్రస్తుతం ఉన్న సొంత ఇల్లు ఇరుకుగా ఉండటం, సమావేశాలు నిర్వహించడానికి సాధ్యం కాకపోవడంతో కొద్దికాలంగా ఆయన లేక్‌వ్యూ అతిథి గృహాన్ని క్యాంప్ కార్యాలయంగా వినియోగిస్తున్నారు.

చిన్న సమావేశం నిర్వహించాలన్నా ఇటు సచివాలయంలో లేదా లేక్‌వ్యూకు వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న నివాస భవనంలో పాతిక, యాభై మందికి సరిపడా హాలు కూడా లేకపోవడంతో కొత్త ఇంటి నిర్మాణంపై చంద్రబాబు దృష్టిసారించారు.

ప్రస్తుతం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 65లోని ఆయన సొంతింటిని కూల్చివేసి తమ అవసరాలకు అనుగుణంగా కొత్తది నిర్మించుకోవాలని నిర్ణయించారు. దీనికి దాదాపు 15నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 24లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఏప్రిల్ 12న ఆ ఇంటికి చంద్రబాబు మారనున్నారు.












Click it and Unblock the Notifications