జయలలితపై హీరో విజయ్ కసి: పగ తీర్చుకుంటారా ?
హైదరాబాద్: తమిళ హీరో విజయ్ ముఖ్యమంత్రి జయలలిత అన్నాడియంకెకు వ్యతిరేకంగా శాసనసభ ఎన్నికల్లో పావులు కదుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నిజానికి గత ఎన్నికల్లో విజయ్ అన్నాడియంకెకు మద్దతు పలికారు. అయితే, జయలలిత పట్టించుకోకపోవడమే కాకుండా విజయ్‌ని ముప్పు తిప్పలు పెట్టారు.
అన్నాడియంకె ప్రత్యర్థులకు మద్దతు ఇవ్వడానికి విజయ్ పావులు కదుపుతున్నట్లు మీడియాలో వార్తలు వార్తలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకేకు మద్దతివ్వాలని విజయ్ తన అభిమాన సంఘాలకు మౌఖిక ఆదేశాలు పంపినట్టు ప్రచారం సాగుతోంది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ అన్నాడియంకె చీఫ్ జయలలితను కలుసుకుని మద్దతు ప్రకటించారు. దాంతో విజయ్ అభిమాన సంఘాలు కూడా జయకు అనుకూలంగా పనిచేశాయి.
అయితే, జయకు మద్దతు ప్రకటించడంతో ఆగకుండా విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ డీఎంకే అధినేత కరుణానిధి కుటుంబానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేసారు. సినీ పరిశ్రమను కరుణ కుటుంబం అణగదొక్కుతోందని, పరిశ్రమను ఆ కుటుంబ సభ్యులు కబ్జా చేశారని ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో అన్నాడియంకె విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.

అయితే, విజయ్ కుటుంబానికి - అన్నాడీఎంకేకు దూరం పెరిగింది. విజయ్ నటించిన పులి, తలైవా, తుపాకీ సినిమాల విడుదల సమయంలో తీవ్రమైన సమస్యలు వచ్చాయి.విజయ్ అపాయింట్‌మెంట్ అడిగినా జయ తిరస్కరించారని ఒకానొక సందర్భంలో వార్తలు కూడా వచ్చాయి. పులి సినిమాకు ముందు రోజు విజయ్ నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయ్ అభిమానులు బీజేపీకి మద్దతు పలికారు. అప్పట్లో విజయ్ ప్రధాని మోడీని కలిశారు. దాంతో ఆయన అభిమానులు బిజెపికి అనుకూలంగా వ్యవహించారు.
ఎన్నికల్లో డిఎంకెకు మద్దతు ఇవ్వాలని సూచిస్తూ విజయ్ అభిమాన సంఘాల అధ్యక్షుడు ఆనంద్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల అభిమాన సంఘాల నేతలకు స్పష్టమైన మౌఖిక ఆదేశాలు వెళ్లాయని అంటున్నారు. డీఎంకే అభ్యర్థుల విజయం కోసం పని చేయాలని, ఇందుకు 'అవసరమైన వాటిని' సమకూర్చుకోవాలని కూడా సూచనలు వెళ్లాయి. దాంతో ఆయన అభిమాన సంఘాల నేతలు ఇప్పటికే ఆయా జిల్లాల్లో డీఎంకే అభ్యర్థుల వద్దకెళ్లి మద్దతు పలికారు.
అయితే విజయ్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పుడు డీఎంకేకు బహిరంగంగా మద్దతిస్తే ఆ తర్వాత అన్నాడీఎంకే ప్రభుత్వం వస్తే మరిన్ని సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతో విజయ్ తెర వెనక నుంచి కథ నడిపిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..?












Click it and Unblock the Notifications