భారతి కళ్లలోకి జగన్: తల్లి, చెల్లి మురిపెం(పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం మూడు గంటల నలభై అయిదు నిమిషాలకు హైదరాబాదులోని చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు. ఆయన రాక కోసం పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు ఎదురూ చూశారు. జగన్ జైలు నుండి బయటకు రాగానే అభిమానులు ఒక్కసారిగా ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు.
బుల్లెట్ ప్రూఫ్ కారులో జగన్ భారీ ర్యాలీతో లోటస్ పాండులోని తన ఇంటికి బయలుదేరారు. మూడు గంటల నలభై అయిదు నిమిషాలకు బయలుదేరిన కాన్వాయ్ తొమ్మిది గంటల నలభై అయిదు నిమిషాలకు లోటస్ పాండుకు చేరుకుంది. రోడ్లపై నిలబడ్డ కార్యకర్తలకు ఆయన అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లారు.
జగన్ ఇంటికి చేరుకున్నాక ఆయన కుటుంబ సభ్యులు హారతి ఇచ్చి ఇంట్లోకి స్వాగతం పలికారు. 16 నెలల తర్వాత జగన్ ఇంటికి చేరుకోవడంతో ఇంట్లో, పార్టీ క్యాడర్‌లో ఆనందం కనిపిస్తోంది. కాగా, జగన్ జైలు నుండి బయటకు వచ్చిన సమయంలో ఓ తెలంగాణవాది గేటు ముందు జై తెలంగాణ ప్లకార్డు పట్టుకొని కూర్చున్నాడు. మరోవైపు జగన్ కాంగ్రెసు పార్టీతో మ్యాచ్ ఫిక్సింగులో భాగంగానే విడుదలయ్యారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

బంజారాహిల్స్‌లో
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలై ర్యాలీగా లోటస్ పాండుకు వెళ్తున్న దృశ్యం.

అభిమాన నాయకుడి కోసం
జైలు నుండి విడుదలై వస్తున్న తమ అభిమాన నాయకుడిని చూడటం కోసం పలువురు అభిమానులు, కార్యకర్తలు గేట్ల పైకి, గోడల పైకి ఎక్కి చూశారు.

ఇంటి ముందు
చంచల్ గూడ జైలు నుండి విడుదలైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి చేరుకున్నాక కార్యకర్తలకు అభివాదం.

జగన్ రాకతో మోములో నవ్వు
పదహారు నెలల అనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండి రావడంతో ఆయన సతీమణి భారతి, తల్లి వైయస్ విజయమ్మ, సోదరి షర్మిల మొహంలో నవ్వు.

నీ రాక కోసం
జైలు నుండి విడుదలైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్న భారతి, విజయమ్మ, జగన్ కూతుళ్లు, కుటుంబ సభ్యులు.

జగన్ అభివాదం
చంచల్ గూడ జైలు నుండి విడుదలైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి చేరుకున్నాక కార్యకర్తలకు అభివాదం.

రాకతో ఆనందం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండులోని ఇంటి వద్దకు చేరుకున్నాక అభిమానుల కోలాహలం.

జగన్‌కు హారతి
పదహారు నెలల అనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలై ఇంటికి రావడంతో హారతి పడుతున్న కుటుంబ సభ్యులు, బంధువులు.

టపాసుల కాల్చి...
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల కావడంతో ఆయన నివాసం వద్ద టపాసులు కాల్చి పండుగ చేసుకున్నారు.

టపాసులు కాల్చిన కార్యకర్తలు
పదహారు నెలల అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల కావడంతో ఆయన నివాసం వద్ద టపాసులు కాల్చి పండుగ చేసుకున్నారు.

కుటుంబ సభ్యులు
జైలు నుండి విడుదల అయిన అనంతరం భారీ ర్యాలీగా లోటస్ పాండుకు వచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డి. వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులు.

విజయమ్మ మురిపెం
జైలు నుండి విడుదలై ఇంటికి వచ్చిన తన తనయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మురిపెంగా చూస్తున్న తల్లి విజయమ్మ.

కుటుంబ సభ్యులతో
జైలు నుండి విడుదల అయిన అనంతరం భారీ ర్యాలీగా లోటస్ పాండుకు వచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డి. వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

కుటుంబ సభ్యులు, నాయకులు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రావడంతో కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తల ఆనందం.

భారతి వైపు చూస్తూ..
తన సతీమణి భారతి వైపు చూస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

జైలు నుండి బయటకు వచ్చిన జగన్
పదహారు నెలల జైలు జీవితం అనంతరం చంచల్ గూడ నుండి బయటకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్.

జన సందోహం
పదహారు నెలల జైలు జీవితం అనంతరం చంచల్ గూడ నుండి బయటకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్. కార్యకర్తల కోలాహలం.

పూల వర్షం
చంచల్ గూడ జైలు నుండి బయటకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన అభిమానుల పూల వర్షం.

జగన్ కోసం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం జైలు వద్ద కార్యకర్తల నిరీక్షణ. పోలీసులు ముళ్లకంచె, బారీకేడ్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

జగన్నినాదం
పదహారు నెలల జైలు జీవితం అనంతరం చంచల్ గూడ నుండి బయటకు వస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కోసం ఆయన ఫోటోతో అభిమాని నిరీక్షణ.

రంగుల పండుగ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడ జైలు నుండి విడుదల కావడంతో ఆనందంతో రంగులు చల్లుకుంటున్న కార్యకర్తలు.

జైలు ప్రాంగణం కిక్కిరిసింది
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం సిద్ధంగా ఉంచిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం.

అభివాదం
పదహారు నెలల జైలు జీవితం అనంతరం చంచల్ గూడ నుండి బయటకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అభివాదం.

మలకపేట వద్ద కాన్వాయ్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మలకపేటకు చేరుకున్న దృశ్యం.

నాంపల్లి వద్ద కాన్వాయ్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ నాంపల్లికి చేరుకున్న దృశ్యం.

నాంపల్లి వద్ద ట్రాఫిక్ జాం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ నాంపల్లికి చేరుకున్న దృశ్యం. అక్కడ ట్రాఫిక్ జాం అయింది.

నాంపల్లిలో ట్రాఫిక్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ నాంపల్లికి చేరుకున్న దృశ్యం. అక్కడ ట్రాఫిక్ జాం అయింది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చారు.

అసెంబ్లీ వద్ద కాన్వాయ్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అసెంబ్లీ వద్దకు చేరుకున్న దృశ్యం.

అసెంబ్లీ వద్ద ట్రాఫిక్ జాం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అసెంబ్లీ వద్దకు చేరుకున్న దృశ్యం. అక్కడ ట్రాఫిక్ జాం అయింది.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications