Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భూమాతో పవన్‌కు సాన్నిహిత్యం, నంద్యాలలో మద్దతెవరికీ?

కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నిక సందర్భంగా జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ ఎవరికీ మద్దతిస్తారనే ఆసక్తి సర్వత్రా ఉత్కంఠను రేకేత్తిస్తోంది.

నంద్యాల: కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నిక సందర్భంగా జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ ఎవరికీ మద్దతిస్తారనే ఆసక్తి సర్వత్రా ఉత్కంఠను రేకేత్తిస్తోంది.

2014 ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ టిడిపి, బిజెపి కూటమికి మద్దతిచ్చారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు బహిరంగసభల్లో పవన్‌కళ్యాణ్ పాల్గొన్నారు.

అయితే ఏపీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వాలపై పవన్‌కళ్యాణ్ దుమ్మెత్తిపోశారు.

ఈ విషయాలపై ఈ రెండు పార్టీల తీరును సభలు నిర్వహించి పవన్ ఎండగట్టారు. అయితే అదే తరుణంలో ఈ నెల 30వ, తేదిన విశాఖలో నిర్వహించిన ఉద్దానం కిడ్నీ బాధితుల సమావేశంలో పవన్ మాట్లాడిన తీరు తన వ్యూహన్ని మార్చినట్టుగా సంకేతాలను ఇచ్చారు.

నంద్యాల ఉపఎన్నికలో వపన్ మద్దతు ఎవరికీ?

నంద్యాల ఉపఎన్నికలో వపన్ మద్దతు ఎవరికీ?

కర్నూల్ జిల్లా నంద్యాల ఉపఎన్నిక విషయంలో జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ మద్దతు ఎవరికీ అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గంలో కాపు, బలిజ సామాజికవర్గాలకు చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. మైనారిటీల ఓట్ల తర్వాత కాపు, బలిజ ఓట్లు ఈ నియోజకవర్గంలో గెలుపు, ఓటములపై ప్రభావం చూపనున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ కూడ కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. అయితే ఈ నియోజకవర్గంలో పవన్‌కళ్యాణ్ ప్రచారం చేస్తే ఆ సామాజిక వర్గాలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పవన్ మద్దతు ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీకి కొంత కలిసివచ్చే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

Recommended Video

    Chandrababu Fixed YS Jagan And Pawan Kalyan For 2019 Polls
    భూమా కుటుంబంతో పవన్‌కు సాన్నిహిత్యం

    భూమా కుటుంబంతో పవన్‌కు సాన్నిహిత్యం

    భూమా కుటుంబంతో పవన్‌కళ్యాణ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. 2009 ఎన్నికల సమయంలో సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో భూమా నాగిరెడ్డి, ఆయన సతీమణి శోభా నాగిరెడ్డి చేరారు. ఆళ్ళగడ్డ నుండి పిఆర్‌పి అభ్యర్థిగా భూమా శోభానాగిరెడ్డి పోటీచేసి విజయం సాధించారు. నాగిరెడ్డి మాత్రం ఓటమిపాలయ్యారు. అయితే ఆ సమయంలో వీరిద్దరి ప్రచారం కోసం పవన్‌కళ్యాణ్ ప్రచారం చేశారు. అయితే మారిన పరిస్థితుల్లో పిఆర్‌పి నుండి కాంగ్రెస్‌కు, కాంగ్రెస్‌ నుండి వైసీపీకి , వైసీపీ నుండి టిడిపిలోకి చేరారు భూమా కుటుంబం. అయితే ప్రస్తుతం ఈ స్థానానికి ఉపఎన్నిక సాగుతున్నందున పవన్ కళ్యాణ్ ను మద్దతు కోరితే భూమా కుటుంబానికి మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

    బాబుతో సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వస్తోందా?

    బాబుతో సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వస్తోందా?

    ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై హర్వర్డ్ వైద్యులతో కలిసి ఏపీ సిఎం చంద్రబాబునాయుడును పవన్‌కళ్యాణ్ సోమవారం నాడు చర్చించనున్నారు. అయితే ఈ సమావేశంలో కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలను చేయనున్నారు. ఈ సమావేశంలో రాజకీయాల గురించి చర్చించే అవకాశాలుంటాయా లేదా అనేది మాత్రం స్పష్టత రాలేదు. ఒకవేళ రాజకీయాలపై చర్చ వస్తే నంద్యాల ఉపఎన్నికలో చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్ మద్దతు కోరుతారా అనే చర్చలు కూడ సాగుతున్నాయి.. అయితే ఈ సమావేశం కేవలం ఉద్దానం కిడ్నీ బాధితుల విషయానికే పరిమితమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

    జనసేన మద్దతు కోసం ప్రయత్నాలు

    జనసేన మద్దతు కోసం ప్రయత్నాలు

    నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ మద్దతు కోసం ప్రధాన పార్టీలు ప్రయత్నాలను చేస్తున్నాయని ప్రచారం సాగుతోంది. అయితే జనసేన చీఫ్ ఈ విషయంలో ఎవరికీ మద్దతిస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ముస్లిం ఓట్ల తర్వాత కాపు, బలిజ సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. సుమారు 30 వేల ఓట్లున్నాయి. అయితే పవన్ మద్దతు పలికితే ఆ పార్టీకి గెలుపు నల్లేరు మీద నడకే అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+