బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్: ఎమ్మెల్యే వింత సమాధానాలు(వీడియో)
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తన విద్యాభ్యాసం గురించిన విషయాలను వెల్లడించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు.
విజయవాడ: గత కొంత కాలం క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తన విద్యాభ్యాసం గురించిన విషయాలను వెల్లడించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు గణితం అంటే ఇష్టమని, అందుకే బీకాం చేశానని చెప్పారు.
అయితే, బీకాంలో గణితం ఉండదు, కదా అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ప్రశ్నించారు. దీంతో బీకాంలో గణితం ఎందుకు ఉండదు?, కామర్స్ అంటే గణితమే కదా? అని తిరిగి ప్రశ్నించారు. అంతేగాక, బీకాంలో గణితంతోపాటు ఫిజిక్స్ కూడా ఉందని మరింత ఆశ్చర్యానికి గురిచేశారు.
గణితం అంటే కామర్స్.. బీకాంలో ఉంటుంది కానీ, ఫిజిక్స్ ఉండదు కదా? అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మరోసారి ప్రశ్నించారు. దీనికి జలీల్ ఖాన్ బదులిస్తూ.. గణితం, ఫిజిక్స్ రెండూ కూడా బీకాంలో ఉంటాయని చెప్పారు. తాను బీకాం చదువుకున్నానని, ఆ రెండు సబ్జెక్టులు కూడా ఉన్నాయని చెప్పారు.

తనకు చిన్నప్పట్నుంచి గణితం అంటే ఇష్టమని చెప్పిన జలీల్ ఖాన్.. ఆ సబ్జెక్టులో వందకు వంద మార్కులు వచ్చేవని చెప్పారు. అందుకే తాను బీకాంలో డిగ్రీ చేశానని తెలిపారు. కాగా, ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి కొంత ఆశ్చర్యానికి గురైనా.. ఆ తర్వాత సర్దుకున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications