హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిపై సోనియా ఉత్కంఠ.. మట్టిని ముద్దాడి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రుణం తీర్చుకుందామని, తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసు పార్టీని వంద అసెంబ్లీ, 17 లోకసభ స్థానాల్లో గెలిపిద్దామని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు పిలుపునిచ్చారు.

అనేక ఒడిదుడుకులు, అడ్డంకులు ఎదుర్కొని తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, తెలంగాణ ప్రజలు ఆమె రుణం తీర్చుకోవాల్సి అవసరం ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టి కాంగ్రెసు నేతలు హైదరాబాదుకు వచ్చారు. విమానాశ్రయంలో వారికి ఘన స్వాగతం లభించింది.

కాంగ్రెస్

కాంగ్రెస్

ప్రపంచం గర్వించేలా తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అప్పుడే రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందని మంత్రి జానా రెడ్డి పిలుపుని చ్చారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

రాష్ట్రం కోసం పోరాడిన రీతిలోనే ఐక్యతను కొనసాగించి మూడు మాసాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములం అవుదామని కోరారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

ఆదివారం గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం 58 ఏళ్లపాటు అన్ని మతాలు, కులాలు, వర్గాలు పోరాటం చేశాయని, ఎందరో బలిదానం చేసుకున్నారన్నారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

భారతజాతి అంతా సమస్యను అర్థం చేసుకుందని, తెలంగాణ అమరవీరులు, విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, అన్నీ వర్గాలు భారతజాతి గుండెల్లోకి తెలంగాణ ఆవశ్యకతను ఎక్కించారని తెలిపారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

కరీంనగర్ సభలో ఇచ్చిన హామీకి కట్టుబడిన సోనియా గాంధీ అనేక ఇబ్బందులు ఎదుర్కొని తెలంగాణ సాధనకు అవిరామ కృషి చేశారన్నారు. 10 రోజులుగా ఆమె అనుభవించిన ఉత్కంఠత వర్ణనాతీతమన్నారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

దానికి గాను తెలంగాణ ప్రాంతంలో 17 ఎంపీ సీట్లు, 110 ఎమ్మెల్యే సీట్లు కాంగ్రెస్‌కు సాధించి సోనియా గాంధీకి కృతజ్ఞత చెప్పాలని వారు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్

కాంగ్రెస్


సామాజిక, ఆర్థిక, న్యాయపర అభివృద్ధి, సంక్షేమం సాధించి దేశం గర్వించే స్థాయిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అందరూ అంకితం కావాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

చిన్న చిన్న పొరపాట్లును సరిదిద్దుకుని ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కృషి చేసి దేశంలో పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ భవనాలకు సోనియా పేరు పెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ను గెలిపించి సోనియా రుణం తీర్చుకోవాలని మంత్రి గీతా రెడ్డి కోరారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణ ప్రజలు సాయం చేసిన వారిని మరచిపోరని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘన విజయం సాధించి పెడతారని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు అన్నారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

బడుగుబలహీన వర్గాల ప్రజల కష్టనష్టాలను తెలుసుకున్న తరువాతే సోనియా రాష్ట్రమిచ్చారని ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి చెప్పారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

కాంగ్రెస్ విధాన నిర్ణయం తీసుకుంటే ఏ విధంగా నెరవేరుస్తుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలోనే అర్థమయిపోయిందని మరో ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

ఈ సమావేశాన్ని మంత్రి దానం నాగేందర్ నిర్వహించగా, సభకు ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మంత్రులు డికె ఆరుణ, సునీతాలక్ష్మారెడ్డి, బస్వరాజు సారయ్య, ప్రసాద్‌కుమార్, శ్రీధర్ బాబు, ఎంపీలు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రాజయ్య, ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్, ఎమ్మెల్యేలు ఆకుల రాజేందర్, ప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు కోలాటం ఆడి సంతోషం పంచుకున్నారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణ..సోనియమ్మ ఇచ్చిన వరమని తెలంగాణ కేంద్ర మంత్రులు, ఆ పార్టీ ఎంపీలు వెల్లడించారు. ఆదివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న వీరు శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ చెప్పారు

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణ కల సుధీర్గకాలం పోరాటం సాగించిన తరువాత అమ్మ సోనియమ్మ సహకారంతో నెరవేరిందని కేంద్ర సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

ప్రజలు తమను ఎంపీగా గెలిపించిన కాలంలోనే తెలంగాణ రావడం తమ పూర్వజన్మసుకృతమని పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ చెప్పారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

ప్రాంతాలుగా విడిపోయినా రెండు ప్రాంతాల ప్రజలు మిత్రభావంతో కలసిమెలసి ఉండాలని సోనియాగాంధీ సూచించారని ఆ మేరకు అందరూ నడుచుకోవాన్నారు

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణ సాధించుకొని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాగానే తమ నాయకులందరం తెలంగాణ భూమిని ముద్దాడామని ఎంపీ పొన్నం ప్రభాకర్ చెప్పారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

చంద్రబాబు, జైలుజీవితం గడిపిన జగన్ వివిధరాష్ట్రాల్లో తిరుగుతూ సమైక్యం సమైక్యం అంటూ తెలంగాణ వాసులకు తీరని ద్రోహం చేశారన్నారు. ఈ రెండు పార్టీలను తెలంగాణ నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణలోని సహజ వనరులను, మానవ వనరులను ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని ఎంపీ రాజయ్య అన్నారు. తెలంగాణ సాధించిందుకు సంబురాలు జరుపుకోకుండా.. సీమాంధ్ర వాసులకు కూడా సహకారమిచ్చి రెండు రాష్ట్రాలు అభివృద్ది పథంలో నిలిచేలా చేయాలని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.

English summary
With the Telangana Bill having been passed in Parliament, Congress leaders from the region vowed to develop the new state as a model in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X