వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్: తెలుగుదేశం ఇక జాతీయ పార్టీగా అవతరిస్తుందని, ఎవరూ ఖాళీ చేయలేరని ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. మంగళవారం మహబూబ్‌నగర్ ప్రజాగర్జన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఉన్నంతకాలం తెదేపా ఉంటుందని, జాతీయ పార్టీగా అవతరిస్తామన్నారు.

35 రోజుల దూరంలో ఉన్న ఎన్నికల సమయంలో తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్, టిఆర్‌ఎస్ మోసాలకు బలికావద్దన్నారు. తెలంగాణలో తెదేపా అధికారంలోకి వస్తే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. పేదవారికి రాజ్యాధికారం దక్కాలన్నదే తెదేపా ధ్యేయమన్నారు.

జాతీయ పార్టీగా ఢిల్లీలో చక్రం తిప్పి తెలుగు ప్రజల అభివృద్ధికి అహర్నిశలు పని చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సైకిల్ స్పీడ్ పెంచి, అడ్డొచ్చిన వాళ్లను తొక్కుకుంటూ పోతామన్నారు. కెసిఆర్ పనిచేసే వ్యక్తి కాదు, ఫామ్‌హౌస్‌లో పడుకునే వ్యక్తి అని ధ్వజమెత్తారు.

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

కెసిఆర్ తన దగ్గర పని చేశాడని, క్రమశిక్షణ తెలియని వ్యక్తి అని చంద్రబాబు అన్నారు. నీళ్లు ఇవ్వం, ఉద్యోగులు వెళ్లిపోవాలి లాంటి వ్యాఖ్యలతో మరోసారి తెలుగు ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని దుయ్యబట్టారు.

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలపై మోపడానికి కెసిఆర్ కుట్ర పన్నుతున్నాడని విమర్శించారు. తెరాస ఉప ఎన్నికల పార్టీ అని, సాధారణ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదన్నారు.

 చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

వచ్చే ఎన్నికల్లో తెరాసకు ఘోరమైన ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. దేశంలో కాంగ్రెస్ ఇక అధికారంలోకి రాదని, అవినీతిలో కూరుకుపోయి ప్రజలను నట్టేట ముంచిందన్నారు. కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించి తెలుగు ప్రజల సత్తా చూపాలన్నారు.

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

విభజనను నేనెప్పుడూ వ్యతిరేకించలేదని, తెలంగాణ అంటే తనకెంతో అభిమానమని, ఆ ప్రాంతం బాగా వెనకబడిపోవడం వల్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నానని చెప్పారు.

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చానని, తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత టిడిపిదేనని, పాలమూరుకు వైద్య కళాశాల తెచ్చామన్నారు.

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

బయ్యారం గనుల దోపిడీ, బాబ్లీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తామే పోరాడామని, కాదని ఎవరైనా అంటే, బహిరంగచర్చకు సిద్ధపడాలన్నారు. దీనిపై గతంలో కెసిఆర్ తన సవాల్ స్వీకరించలేదన్నారు.

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

ఫాంహౌస్‌కు పారిపోయారని, తెలంగాణ అభివృద్ధికి ఆయన ఏమైనా చేశారా? రెండు ప్రాంతాలను అభివృద్ది చేయడమే తమ పార్టీ విధానమన్నారు.

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

తెలంగాణలో అధికారంలోకి రాగానే.. కోయల్‌సాగర్‌కు నీళ్లు తెచ్చే బాధ్యత టిడిపి తీసుకుంటుందని, మహబూబ్‌నగర్‌కు చెందిన లంబాడీ సామాజికవర్గం నుంచి ఒకరిని ఎమ్మెల్సీని చేస్తామన్నారు.

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

వరంగల్‌ను మరో హైదరాబాద్‌ను చేస్తామన్నారు. పాలమూరును మహానగరంగా తీర్చిదిద్దుతామని, ఢిల్లీని శాసిస్తామని, అందరికీ న్యాయం జరగాలని కోరాను.. అది తాను చేసిన తప్పా? అన్నారు.

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

తాను ఎక్కడికీ వెళ్లనని, తెలుగుజాతితోనే ఉంటానని, తమ పార్టీ జాతీయపార్టీగా ఆవిర్భవించబోతున్నదని, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని మళ్లీ శాసించే శక్తి తమకే ఉందన్నారు.

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

రానున్న కాలంలో సైకిల్ స్పీడు పెంచుతామని, బుల్లెట్‌లా దూసుకెళ్తామన్నారు. అడ్డువస్తే తొక్కుకుంటూ ముందుకెళ్తామని, సుపరిపాలన అందించే సత్తా టిడిపికే ఉందన్నారు.

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

అధికారంలోకి వస్తే రైతులు, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని, అప్పటిదాకా రుణాలు ఎవరూ కట్టవద్దని, తాము వస్తే దీపం పథకం పునరుద్దరించి గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని, మహిళా సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు. తెలంగాణ కోసం ప్రత్యేక ప్రణాళిక వేసి సమగ్ర అభివృద్ధిని సాధిస్తామని, తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని సిఎం చేస్తామంటూ తాను విసిరిన రామబాణం ప్రభంజనం సృష్టిస్తోందన్నారు.

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

చంద్రబాబు గాలం, వేణుమాధవ్ చురకలు (పిక్చర్స్)

మహాగర్జనలో పాల్గొన్న వేణుమాధవ్ రాహుల్ గాంధీ పెళ్లి పైన సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కాడని, అలాగే పెళ్లీ కాదని నటుడు వేణుమాధవ్ ఎద్దేవా చేశారు. ప్రజా గర్జన వేదికపై ఆయన విసిరిన ఛలోక్తులు బాగా పండాయి. పెళ్లి కావాలంటే ఆయన పాలమూరుకొచ్చి టిడిపిలో చేరాలని, అప్పుడు ఇక్కడే పిల్లను చూసి పెళ్ళి చేస్తామన్నారు. తాను బాణాన్ని అని ఒకామె అంటున్నదని, మరొకాయన తన డ్రైవర్‌ను.. కారును ఇంటికి తీసుకెళ్లమంటే జైలుకు తీసుకెళ్తున్నాడని పరోక్షంగా షర్మిలా, జగన్‌లను ఉద్దేశించి వేణుమాధవ్ అన్నారు.

English summary
Photos: Telugudesam Party Prajagarjna in Mahaboobnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X