వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకిచ్చారు, ఆలోచనలో పడ్డ చంద్రబాబు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శివరామకృష్ణన్ కమిటీ షాకిచ్చింది. అలాగే ఒకేచోట పరిపాలన ఉండాలన్న ప్రభుత్వ అభిప్రాయంతోను కమిటీ ఏకీభవించలేదు.

సూపర్ రాజధాని నిర్మాణం అసాధ్యమని పేర్కొంది. వీటీజీఎం రాజధానికి అనువైన ప్రాంతం కాదని తేల్చి చెప్పింది. హైదరాబాదులో భూములు దొరకవని పేర్కొంది. భూమి సేకరన ఎక్కడ సులువైతే అక్కడే రాజధాని అని పేర్కొంది. భువనేశ్వర్‌లా రాజధాని బాగుంటుందని పేర్కొంది.

రాజధాని విషయమై ఆప్షన్లు ఇస్తామని, రెండు మూడు నగరాలను ఎంపిక చేస్తామని, వచ్చే నెల మధ్యలో కేంద్రానికి నివేదిక ఇస్తామని చెప్పారు.

చంద్రబాబుతో

చంద్రబాబుతో

ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన వేసిన శివరామకృష్ణన్ కమిటీ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన వేసిన శివరామకృష్ణన్ కమిటీ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. శివరామకృష్ణన్ మాట్లాడుతుండగా...

ఆలోచనలో చంద్రబాబు

ఆలోచనలో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన వేసిన శివరామకృష్ణన్ కమిటీ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సమయంలో ఆలోచిస్తున్న చంద్రబాబు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన వేసిన శివరామకృష్ణన్ కమిటీ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సమయంలో ఆలోచిస్తున్న చంద్రబాబు.

శివరామకృష్ణన్ కమిటీ

శివరామకృష్ణన్ కమిటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న శివరామకృష్ణన్ కమిటీ.

శివరామకృష్ణన్ కమిటీ

శివరామకృష్ణన్ కమిటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న శివరామకృష్ణన్ కమిటీ. రాజధానిగా విజయవాడ - గుంటూరు మధ్య ఉంటే బాగుంటుందని ఓ మంత్రి అభిప్రాయపడినప్పటికీ అది సాధ్యం కాకపోవచ్చునని చెప్పారు.

శివరామకృష్ణన్ కమిటీ

శివరామకృష్ణన్ కమిటీ

రాజధాని నగరం రాష్ట్రానికి కేంద్రంగా ఉండాలని చంద్రబాబు సూచించారని అయితే, ఒక సింగిల్‌ సూపర్‌ సిటీ నిర్మాణం సాధ్యం కాదని కమిటీ తెలిపింది.

శివరామకృష్ణన్ కమిటీ

శివరామకృష్ణన్ కమిటీ

చాలాచోట్ల రాజధాని నగరాలు ఇతర నగరాల అభివృద్ధికి కారణమయ్యాయని తెలిపారు. గాంధీనగర్‌ వల్ల అహ్మదాబాద్‌, ఇస్లామాబాద్‌ వద్ద రావల్పిండి అభివృద్ధి చెందాయన్నారు.

శివరామకృష్ణన్ కమిటీ

శివరామకృష్ణన్ కమిటీ

ప్రపంచంలో వివిధ దేశాల్లోని రాజధాని నగరాలను పరిశీలిస్తే.. పలు దేశాల్లో రాజధాని నగరాన్ని మించి నగరాలు అభివృద్ధి చెందాయని, అతి ముఖ్యమైన పాలనా వ్యవహారాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో ఉండేలా చూడాల్సి ఉందని, మిగిలిన వాటిని ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు.

శివరామకృష్ణన్ కమిటీ

శివరామకృష్ణన్ కమిటీ

ఒడిసా రాజధాని భువనేశ్వర్‌ అత్యుత్తమ రాజధానిగా ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం నిజాం సంస్థానం నుంచీ భూములు అందుబాటులో ఉండడమేన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి చోటా భూములు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఈ పరిస్థితుల్లో భూ సేకరణ విపరీతమైన ఖర్చుతో కూడుకున్నదన్నారు.

శివరామకృష్ణన్ కమిటీ

శివరామకృష్ణన్ కమిటీ

రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న పట్టుదల చంద్రబాబులో కనిపించిందని శివరామకృష్ణన్‌ చెప్పారు. ఇలాంటి పట్టుదల కలిగిన ముఖ్యమంత్రి ఉండడం చాలా అవసరమన్నారు. విశాఖ, దక్షిణ రాయలసీమ, అనంతపురం-కర్నూలు ప్రాంతాలు, మధ్య కోస్తా అభివృద్ధి చెందాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని తెలిపారు.

శివరామకృష్ణన్ కమిటీ

శివరామకృష్ణన్ కమిటీ

విమానాశ్రయాలు, వైజాగ్‌- చెన్నై కారిడార్‌, శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే లైను, పోర్టులు వంటి వాటికి మౌలిక సదుపాయాల కల్పన సంక్లిష్టంగా మారిందని, వీటిపైనే ప్రధానంగా దృష్టి సారించి బాబుతో చర్చించామన్నారు. వీజీటీఎం అనువైన ప్రాంతం కాదన్నారు.

శివరామకృష్ణన్ కమిటీ

శివరామకృష్ణన్ కమిటీ

గుంటూరు-విజయవాడను రాష్ట్ర రాజధానిగా చేస్తామని ఒక మంత్రి భావించి ఉండవచ్చని, అది ఆయన అభీష్టం కావచ్చని, కానీ, ఆయన అభీష్టమే నెరవేరుతుందని ఆయన కూడా భావించడం లేదన్నారు.

English summary
Photos of Sivaramakrishnan Committee with Andhra Pradesh CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X